Site icon HashtagU Telugu

Mangli Reaction: నాపై ఎలాంటి దాడి జరగలేదు: సింగర్ మంగ్లీ

mangli

Resizeimagesize (1280 X 720) 11zon

కర్ణాటకలోని బళ్లారిలో ఓ కార్యక్రమానికి వెళ్లిన సింగర్ మంగ్లి కారు మీద రాళ్ల దాడి జరిగిందంటూ పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మంగ్లీ దాడిపై రియాక్ట్ అయ్యారు. తన కారుపై అసలు రాళ్ల దాడి జరగలేదని, బళ్లారిలో కార్యక్రమం ఊహించని విధంగా సక్సెస్ అయ్యిందని అన్నారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఎవరూ నమ్మకూడదని ఓ లేఖలో ప్రస్తావించారు. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికే కొంతమంది ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చెస్తున్నారని మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బళ్లారి ప్రజలు నన్ను ఎప్పటికీ ప్రేమిస్తారని చెప్పింది.

తెలుగు ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సింగర్ మంగ్లీ అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేలా పాటలు పాడిన సింగర్ మంగ్లీ.. తర్వాత సినిమా పాటలతో కూడా బాగా పాపులర్ అయింది. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంతంగా పాటలు నిర్మించడం, పాడటం చేసింది. మొత్తానికి సింగర్ మంగ్లీ అంటే తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా గుర్తుపట్టే స్థాయిని సంపాదించుకుంది. పలు హిట్ సినిమాల్లో పాటలు పాడి క్రేజీ సింగర్ గా దూసుకుపోతోంది.