Site icon HashtagU Telugu

Singer Mangli: మంగ్లీకి అరుదైన గౌరవం.. ఎస్వీబీసీ సలహదారుగా నియామకం!

Mangli Birthday Party

Mangli Birthday Party

టిటిడి ఎస్‌విబిసి ఛానెల్‌కు సలహాదారుగా ఫోక్ సింగర్ మంగ్లీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఆమెను మార్చిలో మాత్రమే SVBC ఛానెల్‌కు సలహాదారుగా నియమించింది. నాలుగు రోజుల క్రితమే ఆమె బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమెకు గౌరవ వేతనంగా నెలకు రూ.లక్ష వస్తుందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

మంగ్లీ ఆలయాన్ని సందర్శించినప్పుడల్లా టీటీడీ ఆమెకు రవాణా, వసతి సౌకర్యాలు కల్పిస్తుంది. గాయని మంగ్లీ తన మనోహరమైన గాత్రంతో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఏపీలో టాలీవుడ్ నుంచి అలీ, పోసాని తర్వాత సింగర్ మంగ్లీకి ఈ అరుదైన అవకాశం లభించింది.