Site icon HashtagU Telugu

Death Execution: 20 ఏళ్లలో తొలిసారిగా మహిళకు ఉరిశిక్ష.. ఎక్కడో తెలుసా?

Death Execution

Death Execution

మాములుగా తప్పు చేసినప్పుడు శిక్ష వేయడం అన్నది కామన్. కొన్ని కొన్ని సార్లు ఉరిశిక్ష కూడా వేస్తూ ఉంటారు. అయితే ఉరిశిక్షలు వేయడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఉరిశిక్షలు గురించి విన్న అందులో ఎక్కువగా మగవారే ఉంటారు అన్న విషయం తెలిసిందే. చాలా తక్కువగా మాత్రమే ఆడవారికి ఉరిశిక్షలు పడుతూ ఉంటాయి. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒక మహిళకు ఉరిశిక్ష వేశారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? అసలు ఏమయ్యింది?అన్న వివరాల్లోకి వెళితే..

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఒక మహిళను సింగపూర్‌ ఉరితీసింది. స్థానికంగా ఒక మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం దాదాపు 20 ఏళ్లలో ఇది తొలిసారి కావడం గమనార్హం. అయితే ఈ విషయంలో హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం ఈ శిక్షను అమలు చేసింది. సారిదేవి దామని అనే 45 ఏళ్ళ మహిళకి విధించిన ఉరిశిక్ష శుక్రవారం అమలయ్యింది అని సెంట్రల్‌ నార్కోటిక్స్‌ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారు.

నేర ఆరోపణలు, శిక్షకు వ్యతిరేకంగా ఆమె అప్పీల్ చేసుకున్నప్పటికీ 2022 అక్టోబరులో కోర్టు దాన్ని కొట్టేసింది. అధ్యక్షుడు సైతం ఆమె క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించారు. అంతకుముందు 2004లో యెన్‌ మే వూయెన్‌ అనే 36 ఏళ్ళ మహిళకు ఇదే తరహా కేసులో ఉరిశిక్ష అమలైంది. ఇదిలా ఉండగా సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మాదకద్రవ్యాల నిరోధక చట్టాలు అమలులో ఉన్నాయి. 500 గ్రాములకు మించి గంజాయి, 15 గ్రాములకు పైగా హెరాయిన్‌ను రవాణా చేస్తూ పట్టుబడితే మరణశిక్ష విధించడం ఖాయం. అనేక దేశాలు ఉరిశిక్ష విషయంలో వెనక్కి తగ్గినప్పటికీ సింగపూర్‌ మాత్రం మానవ హక్కులను, ఇతర నిబంధనలను కాలరాస్తూ డ్రగ్స్‌ సంబంధిత నేరాల్లో దోషులను ఉరితీస్తోంది అని హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. అయితే మరణ శిక్షల అమలు సింగపూర్‌ను ఆసియాలోని సురక్షితమైన దేశాల్లో ఒకటిగా నిలుపుతోందని ప్రభుత్వం వాదిస్తోంది. డ్రగ్‌ ట్రాఫికింగ్‌ కేసులో మరో దోషిని ఆగస్టు 3న ఉరితీసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Exit mobile version