Healthy Women: మహిళలూ ఈ టిప్స్ పాటించండి…ఆరోగ్యంగా ఉండండి..!!

ఆరోగ్యవంతమైన మహిళా అంటే 50 కిలోల కంటే తక్కువ బరువు ఉండటం...30 అంగుళా ల కంటే తక్కువ నడుము చుట్టుకొలత ఉండటం కాదు. శారీరక ఆరోగ్యంతో పాటు...

  • Written By:
  • Publish Date - March 2, 2022 / 12:36 PM IST

ఆరోగ్యవంతమైన మహిళా అంటే 50 కిలోల కంటే తక్కువ బరువు ఉండటం…30 అంగుళా ల కంటే తక్కువ నడుము చుట్టుకొలత ఉండటం కాదు. శారీరక ఆరోగ్యంతో పాటు…మానసికంగా ఉల్లాసంగా ఉండటం. ప్రతి మహిళలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. పిల్లలు, ఇల్లు, ఆఫీసు..ఇలా ప్రతి బాధ్యతను ఛాలెంజింగ్ తీసుకుని ముందుకు సాగుతుంది. మరి మహిళల ఫిట్ నెస్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారు. తెలుసుకుందాం.

స్త్రీ, పురుషుల శరీరాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ వ్యత్యాసాలే రోగనిరోధక, రోగనిర్ధారణలు, చికిత్సలను ప్రభావితం చేస్తుంటాయి. అయితే మహిళలు కొత్త నిర్ణయాలు తీసుకోవల్సిన సమయం వచ్చేసింది. గత రెండు సంవత్సరాలు కోవిడ్ పుణ్యమాని ప్రజలు అనుక్షణం అనారోగ్య భయంతో బతుకుతున్నారు. ఇంటి నుంచే పనిచేయడం, పిల్లలను చూడటం, ఇంట్లోనే చదివించడం, ఇతర కుటుంబ సభ్యులతో, స్నేహితులతో , సహోద్యోగులతో సంబంధాలు లేకపోవడం…ఇవన్నీ కూడా మహిళలను చాలా ప్రభావితం చేశాయి.

ఆరోగ్య సంరక్షణలోభాగంగా దాదాపు 80శాతం మంది మహిళలకు ఆరోగ్యంపై దారితీసే ఫలితాలపై అవగాహన పెంచాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ప్రతి మహిళ తన బరువును చూసినప్పుడల్లా 50కిలోల కంటే తక్కువగా ఉండాలని కోరకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మహిళలకు కావాల్సింది బరువు, కొలతలు కాదని ఫిట్ నెస్ అని చెబుతున్నారు.

మహిళలు ఫిట్ నెస్ గా ఉండాలంటే కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. కండరాలు, కణజాలాలు మరింత బలంగా ఉండేలా వ్యాయామం చేయడం. విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కేలరీలు బర్న్ చేయాలి. రోగనిరోధక శక్తి తోపాటు, జీవక్రియ రేటు కూడా మెరుగ్గా ఉండాలి. అంటే ప్రతి మహిళ తమ ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టాలి.

2. శరీరంలో హార్మోన్లలో మార్పులు అనేవి 20ఏళ్లలో ప్రారంభం అవుతాయి. కాబట్టి వీరికి సూర్యకాంతిలో ఉండే విటమిన్ డి…చాలా అవసరం.

3. స్త్రీకి జీవక్రియ మధ్య వయస్సులోని కానీ…రుతువిరతి చేరుకునే కాలంలో తగ్గిపోతుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్ మరింత ఎక్కువగా తీసుకోవడం మంచిది. అంతేకాదు మీ జీవక్రియ సక్రమంగా పనిచేయాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

4. ఒత్తిడికి దూరంగా ఉండాలి. డిప్రెషన్ అనేది కొన్ని సార్లు హార్మోన్స్ కు సంబంధించిన వ్యాధులు అనారోగ్య సమస్యలు, బరువు పెరగడం వంటి వాటికి కారణం అవుతుంది. కాబట్టి మీ వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయించాలి.

5. యోగా అనేది శారీరక కదలికలతో పాటు సెల్ఫ్ అవర్ నెస్ కు సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు యోగా చేయడం చాలా మంచిది. ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలని ప్రేరేపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మహిళలు ఫిట్ నెస్ కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి….

1. తగినంత మొత్తంలో ప్రోటీన్లను ఆహారంలో చేర్చుకోవాలి. శరీరానికి కీలకమైనవి ప్రోటీన్లు. బ్రోకలీ, కాయధాన్యాలు, సోయాబీన్స్, ఆస్పరాగస్, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, బచ్చలికూరతోపాటు కొన్ని ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి.

2. ఎక్కువగా ఆకుకూరలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఐరన్, ప్రోటీన్లు, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది.

3. ఆహారాన్ని గబగబ తినడం కాకుండా…నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి. ఆహారాన్ని జీర్ణం చేయడానికి స్పష్టమైన, సులభమైన మార్గాల్లో నమలడం ఒకటి. చాలామంది ఆహారాన్ని ఆతురతతో తింటుంటారు. సరిగ్గా నమలరు. ఇలా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ అలసిపోతుంది. ఆహారాన్ని ఎక్కువగా నమిలి తీసుకున్నట్లయితే…సులభంగా జీర్ణం అవుతుంది.

4. ఇక చాలామంది మహిళలు టీవీ చూసుకుంటూ…ఇతర పనులు చేసుకుంటూ ఆహారం తింటుంటారు. ఎంత తింటున్నాం అనేది చూడరు. అలా చేస్తే కడుపు నిండినప్పటికీ…మెదడు ఇంకా ఎక్కువగా తినాలని సంకేతాలు ఇస్తుంది. ఇలా చేయడం పొరపాటు. మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడు దానిపైన్నే దృష్టి సారించాలి.