Heart Attack: మొదటిసారి వచ్చే హార్ట్ ఎటాక్ అంత తీవ్రత ఎందుకంటే…?

హార్ట్ ఎటాక్...ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య ఇది. అప్పటివరకు సరదాగా తిరిగే వ్యక్తులు...గుండెపోటు కారణంగా అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 21, 2022 / 06:30 AM IST

హార్ట్ ఎటాక్…ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య ఇది. అప్పటివరకు సరదాగా తిరిగే వ్యక్తులు…గుండెపోటు కారణంగా అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు. లైఫ్ స్టైల్ మారడం, సమయానికి తినకపోవడం…కొలెస్ట్రాల్ వంటి కారణాల వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.

అయితే హార్ట్ ఎటాక్ కొందరిలో తీవ్రంగా వస్తే…మరికొందరిలో స్వల్పంగా ఉంటుంది. ఇంకొందరిలో అయితే మొదటిసారి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. శరీరంలో ప్రతి అవయవానికి రక్తనాళాలు ఆక్సిజన్, పోషకాలను అందిస్తాయి. అయితే అవి గుండెకు కూడా చాలా అవసరం. గుండెకు రక్తాన్ని తీసుకుపోయే నాళాల్లో కొవ్వు పేరుకుపోయి…రక్తం సరఫరాకు అడ్డంకులు ఏర్పడతాయి.

దీంతో గుండెకు పోషకాలతోపాటు ఆక్సిజన్ సరఫరా అనేది నిలిచిపోతుంది. ఈ కారణంగా గుండెపోటు వస్తుంది. హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే వీరిని ఆసుపత్రికి తీసుకెళ్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. వైద్యులు పూడుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొలగించి…రక్త ప్రసరణను వెంటనే పునరుద్దరిస్తారు. ఆలస్యం ఎంత అయితే ప్రమాద తీవ్రత అంతగా పెరుగుతుంది.

ఇక గుండెకు రక్తాన్ని తీసుకువచ్చే నాళాలు..చచ్చబడినట్లయితే…ఇతర అవయవాలకు రక్త ప్రసరణ అనేది జరగదు. అందుకే శరీరంలో గుండె చాలా ప్రధానమైందని నిపుణులు చెబుతుంటారు. ఇక రక్తనాళాలు మూసుకుపోయినట్లయితే…వేరే నాళాలు వ్రుద్ధి చెందుతాయి. వీటిని కొల్లేటరల్స్ అంటారు.

వీటితో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అయినప్పటికీ ప్రమాదం కొంచెం తక్కువగానే ఉంటుంది. అయితే మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు ఇవి డెవలప్ కావు. అందుకే మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి ఇవి గుండెపోటుకు కారణం అవుతాయి. సాధారణం రాత్రం 10 నుంచి 11 మధ్యలో నిద్రపోయే వారిలో గుండెపోటు అవకాశం తక్కువగా ఉంటుంది. ఆలస్యంగా పడుకునేవారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆలస్యంగా నిద్రపోయేవారు….ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఈ పరిణామాలతో జీవగడియారం అనేది దెబ్బతీస్తుంది. అంతేకాదు సరిపడే నిద్రలేనివారిలో ఈ ముప్పు తలెత్తు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే మహిళల్లో ఈ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు.

ఆలస్యంగా పడుకునేవారిలో హార్ట్ ఎటాక్ రావడానికి 25శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయట. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.