WhatsApp Update: వాట్సాప్ లో “సైడ్ బై సైడ్” మోడ్.. ఏమిటి, ఎలా ?

WhatsApp ఫీచర్ల విషయంలో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. అదేమిటంటే.. మీరు త్వరలోనే ఒకే స్క్రీన్‌పై.. ఒకే టైంలో అనేక మంది వ్యక్తులతో చాట్ చేయొచ్చు.

WhatsApp New Update: WhatsApp ఫీచర్ల విషయంలో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. అదేమిటంటే.. మీరు త్వరలోనే ఒకే స్క్రీన్‌పై.. ఒకే టైంలో అనేక మంది వ్యక్తులతో చాట్ చేయొచ్చు. ఒకేసారి చాలా మందితో చాట్ చేసే వారికి ఇది బహుమతి కంటే తక్కువేం కాదు. ఈ కొత్త ఫీచర్ కు “సైడ్ బై సైడ్” మోడ్ అని పేరు పెట్టనున్నారని సమాచారం. ఈ ఫీచర్ ఒక విధంగా స్ప్లిట్ స్క్రీన్ లాగా ఉంటుంది. ప్రస్తుతం దీన్ని ఆండ్రాయిడ్ 2.23.9.20 వెర్షన్‌లో బీటా వినియోగదారులతో పరీక్షిస్తున్నారని WABetaInfo ఒక రిపోర్ట్ ను పబ్లిష్ చేసింది.

ఈ ఫీచర్ యొక్క స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. WABetaInfo కథనం ప్రకారం.. ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. దీనికోసం మీరు వాట్సాప్ లో సెట్టింగ్స్ ఆప్షన్ లోని చాట్ సెట్టింగ్‌ లోకి వెళ్లి సైడ్-బై-సైడ్ వ్యూస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ ఫీచర్ చివరి అప్‌డేట్ ఎప్పుడు వస్తుందనే సమాచారాన్ని WABetaInfo వెల్లడించలేదు. వాట్సాప్ Android, iOS పరికరాలకు దాదాపు ఏకకాలంలో అప్‌గ్రేడ్ చేస్తుంది కాబట్టి.. సమీప భవిష్యత్తులో ఇదే ఫీచర్ యొక్క iPad వెర్షన్ ను కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఒక వాట్సాప్ చాట్ ఓపెన్ అయినప్పుడు.. మరో చాట్ విండో ఓపెన్ కాదు.

నాలుగు పరికరాలతో లింక్

వినియోగదారులు తమ WhatsApp ఖాతాలకు గరిష్టంగా నాలుగు పరికరాలను లింక్ చేసుకోవచ్చని WhatsApp ఇటీవల ప్రకటించింది . ఇది వాట్సాప్ వెబ్ లాగిన్ ప్రాసెస్ లాగా ప్రాథమిక రిజిస్టర్డ్ స్మార్ట్‌ఫోన్, QR కోడ్‌తో యాక్సెస్ చేయబడుతుంది. కొత్తగా ప్రారంభించబడిన ఈ మల్టీ-డివైస్ లాగిన్ ఫీచర్ కోసం OTP ఆధారిత ప్రమాణీకరణ ప్రత్యామ్నాయంపై కూడా వారు పనిచేస్తున్నారని కంపెనీ పేర్కొంది.

వాయిస్ క్లిప్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ ..

మీకు వచ్చే వాయిస్ క్లిప్‌లను చదవడానికి యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ రిలీజ్ చేసింది. ఇది వాట్సాప్ చాట్‌లలో షేర్ చేసిన మీ ఆడియో క్లిప్‌లను ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌క్రిప్షన్ చేస్తుంది. కానీ, వాట్సాప్ స్టేబుల్ వెర్షన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. మీరు ఆడియో క్లిప్‌ ను ప్లే చేసిన సమయంలో ట్రాన్స్‌క్రిప్షన్ స్క్రీన్‌పై కనిపించడం ప్రారంభిస్తుంది. వర్క్ లేదా ఇతర విషయాలపై వాయిస్ మెసేజ్‌లను పంపుకోవచ్చు. వాయిస్ నోట్స్ కోసం ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ మెసేజ్‌లో నిర్దిష్ట సమాచారం కోసం సెర్చ్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందో కంపెనీ రివీల్ చేయలేదు. అయినప్పటికీ, ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ఇప్పటికే ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను అందించింది.

వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్‌కు వాట్సాప్ అవసరం లేదు. ఎందుకంటే.. ఇందులో లైవ్ క్యాప్షన్ ఫీచర్ ఉంది. ఎవరైనా ఏదైనా వాల్యూమ్ బటన్‌ను నొక్కడం ద్వారా త్వరగా యాక్సెస్ చేయొచ్చు. ఈ బటన్ వాల్యూమ్ బార్‌లో చూడవచ్చు.సెర్చ్ బార్‌లో టైప్ చేయడం ద్వారా సెట్టింగ్‌లలో లైవ్ క్యాప్షన్ ఫీచర్‌ను పొందవచ్చు. మీరు ఈ ఫీచర్ ఓపెన్ తర్వాత, మీరు చేయాల్సిందల్లా వాయిస్ క్లిప్‌ను ప్లే చేయడమే.. ఆ తర్వాత మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ అవుతుంది. వాట్సాప్‌లో వాయిస్ ట్రాన్స్‌క్రిప్ట్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఉంటుంది. మీరు వాయిస్ మెసేజ్‌లను ట్రాన్స్‌క్రిప్ట్ చేయకూడదని భావిస్తే.. వాట్సాప్ సెట్టింగ్ లోని చాట్స్ లోకి.. ఆ తర్వాత వాయిస్ మెసేజ్ ట్రాన్స్ క్రిప్ట్ ఆప్షన్ ను నొక్కితే సరిపోతుంది.

Also Read:  Hot Water: అయ్య బాబోయ్.. వేడి నేటితో స్నానం చేస్తే అన్ని రకాల ప్రయోజనాలా?