Site icon HashtagU Telugu

Swachh Survekshan awards: సిద్దిపేటకు ‘క్లీనెస్ట్ సిటీ’ అవార్డు

Swachh Survekshan Awards

Swachh Survekshan Awards

Swachh Survekshan awards: 2023 ఆల్ ఇండియా క్లీన్ సిటీ విభాగంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. జనవరి 11 గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్ ఎస్ పూరి ఈ అవార్డును GHMC కమిషనర్ డి రోనాల్డ్ రోస్‌కు అందజేశారు.

సౌత్ జోన్ పరిధిలో 50 వేల నుంచి లక్ష జనాభా కేటగిరీ కింద సిద్దిపేట ‘క్లీనెస్ట్ సిటీ’ అవార్డు గెలుచుకుంది. సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనరసు అవార్డును అందుకున్నారు. ఈ గుర్తింపు పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా కేంద్ర ప్రభుత్వం నుండి సిద్దిపేట అవార్డు పొందటం గొప్ప విషయం. ప్రజల సహకారం, అధికారుల పనితీరు, ప్రజాప్రతినిధుల చొరవతోనే ఇది సాధ్యమైంది. అందరికి శుభాకాంక్షలు అని హరీష్ పోస్ట్ పెట్టారు.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు.

Also Read: Sunnundalu: సంక్రాంతి వంటకాలు.. రుచికరమైన సున్నుండ‌లను ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా?