Site icon HashtagU Telugu

Siddhaanth: గుండెపోటుతో ప్రముఖ టీవీ నటుడు మృతి..!!

Surya Putra

Surya Putra

ప్రముఖ బుల్లి తెరనటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ గుండెపోటుతో మరణించాడు.  ఆయన వయస్సు 46 సంవత్సరాలు. శుక్రవారం జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా మరణించినట్లు సమాచారం. వెంటనే సిద్ధాంత్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు సిద్ధాంత్ ను కాపాడేందుకు తమ వంతు సాయం చేసారు. కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు.

సిద్ధాంత్ కుసుమ్, వారిస్, సూర్యపుత్ర కరణ్ వంటి హిందీ సీరియల్స్ తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ విషాదవార్త అభిమానులకు తీవ్రంగా కలచివేసింది. సిద్ధాంత్ వీర్ కు భార్య అలీసియా రౌత్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిట్ నెస్ విషయంలో సిద్ధాంత్ చాలా జాగ్రత్తగా ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించాడు. కుసుమ్ అనే సీరియల్ తో టీవీ రంగంలోకి అడుగపెట్టాడు. అనేక ప్రముఖ టీవీ షోలలో పనిచేశాడు. కసౌతీ జిందగీకి, ‘కృష్ణ అర్జున్’, క్యాదిల్ మే హై వంటి సినిమాలో సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ కెరీర్ లో దూసుకుపోయాడు. క్యూన్ రిష్టన్ మే కట్టిబట్టి, జిద్ది దిల్ వంటి టీవీ షోలలో ప్రస్తుతం రాణిస్తున్నాడు.

Exit mobile version