Site icon HashtagU Telugu

Triple Talaq: ఇలాంటి భర్తలు కూడా ఉంటారా.. ఆరోగ్యం బాగాలేదని డబ్బులు అడిగినందుకు ట్రిపుల్ తలాక్?

Triple Talaq

Triple Talaq

కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ను నిరోధించడం కోసం చట్టంలో తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ నిత్యం దేశవ్యాప్తంగా ఏదో ఒక ప్రదేశంలో ఈ ట్రిపుల్ తలాక్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఈ ట్రిపుల్ తలాక్ ను నిరోదించినప్పటికి అలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అటువంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. తాజాగా ఒక సిల్లి రీజన్ తో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి తన భార్యకు ఇవ్వడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బాధిత మహిళా తీవ్ర అనారోగ్యం కారణంగా గత కొద్దిరోజులుగా తన పుట్టింట్లో నివసిస్తోందీ. అయితే ఆ మహిళ చికిత్స కోసం డబ్బులు చాలా ఎక్కువగా ఖర్చు అవుతున్నప్పటికీ ఆ ఖర్చులు తల్లిదండ్రులే భరిస్తున్నారు. అవి చాలాక మరింత డబ్బు కోసం బాధ్యత మహిళ తన భర్తకు ఫోన్ చేసి అడగడంతో భార్య డబ్బులు అడగగానే భరించలేకపోయిన ఆ భర్త కోపంతో వెంటనే ఫోన్ లో ట్రిపుల్ తలాక్ చెప్పి మహిళకు ఆమె భర్త విడాకులు ఇచ్చాడు.

దీంతో ఆమె ఏడుస్తూ అత్తమామల ఇంటికి చేరుకుంది. ఆమె అత్తమామలు కూడా కొడుకు సపోర్ట్ గా మాట్లాడుతూ ఆమెను కొట్టి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఇచ్చిన ట్రిపుల్ తలాక్ రికార్డు కూడా ఆమె ఫోన్లో రికార్డు అయింది అని బాధ తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.