Asteroid Attack Earth : పచ్చటి అడవిని ఆస్టరాయిడ్ బూడిద కుప్పగా మార్చిన వేళ..

Asteroid Attack Earth : భూమి చుట్టూ ఎన్నో ఆస్టరాయిడ్స్ (రాక్షస శిలలు) తిరుగుతూ ఉంటాయి.. 115 సంవత్సరాల క్రితం ఒక ఆస్టరాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టింది. నాటి విపత్తుపై స్పెషల్ రిపోర్ట్..

  • Written By:
  • Updated On - June 30, 2023 / 01:04 PM IST

Asteroid Attack Earth : భూమి చుట్టూ ఎన్నో ఆస్టరాయిడ్స్ (రాక్షస శిలలు) తిరుగుతూ ఉంటాయి.. 

అవి అప్పుడప్పుడు భూమి మీదుగా వెళ్తుంటాయి.. 

చాలాసార్లు  ఆస్టరాయిడ్స్ భూమికి  దగ్గరిగా వచ్చి వెళ్లిపోతుంటాయి.. 

కానీ 115 సంవత్సరాల క్రితం ఒక ఆస్టరాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టింది. నాటి విపత్తుపై స్పెషల్ రిపోర్ట్..

1908 జూన్ 30.. అది మన ప్రియమైన భూమికి  ఒక అసాధారణ రోజు. ఆ రోజు ఉదయం రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఆకాశ వీధిపై ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపించింది. ఆ వెంటనే పెద్ద పేలుడు సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ కు సైబీరియా ప్రజల కాళ్ళ కింద ఉన్న భూమి షేక్ అయింది. ఒక పెద్ద గ్రహశకలం (ఆస్టరాయిడ్)  వచ్చి ఢీకొనడంతో రెకా పోడ్కామెన్నయా తుంగుస్కా (Reka Podkamennaya Tunguska) నదికి సమీపంలోని సైబీరియా అడవిలో పేలుడు సంభవించి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అడవిలోని దాదాపు 2,150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతమంతా బూడిద కుప్పగా మారింది. ఆ టైంలో అటవీ ప్రాంతంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే  చనిపోయారు.

Also read : Mexico: మెక్సికోలో విషాదం.. 100 మంది మృతి.. కారణమిదే..?

ఆ ఆస్టరాయిడ్ భూమిని చేరే ముందే గాలిలో పేలిపోయి ఉండొచ్చని అప్పట్లో శాస్త్రవేత్తలు  అంచనా వేశారు. ఆ పేలుడు తీవ్రత  15 మెగాటన్నుల ట్రై నైట్రో టోల్యున్(TNT) ఉండొచ్చని అప్పట్లో లెక్కలు కట్టారు. నాసా ఇటీవల DART మిషన్ లో భాగంగా కైనటిక్ ఇంపాక్ట్ టెక్నాలజీని విజయవంతంగా ప్రదర్శించింది. ఈ సాంకేతికతతో భూమి వైపుగా  దూసుకొచ్చే ఆస్టరాయిడ్‌ ల దిశను వేరే వైపుకు మార్చవచ్చని నాసా వెల్లడించింది.  గ్రహశకలాలు (ఆస్టరాయిడ్స్)  అనేవి సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడిన టైంలో అరకొరగా మిగిలిపోయిన రాతి శకలాలు. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం కంటే.. 1.3 రెట్లు తక్కువ దూరంలో ఉన్న అంతరిక్ష వస్తువులను ఆస్టరాయిడ్స్ గా పరిగణిస్తున్నారు.