Zaheeruddin Ali Khan : గద్దర్ అంతిమయాత్రలో విషాదం .. సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ మృతి

గద్దర్ అంతిమ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. సియాసత్ ఉర్దూ పత్రిక (The Siasat Daily) మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ (Zaheeruddin Ali Khan) (63) గుండెపోటు (Heart stroke)తో మరణించారు. సోమవారం మధ్యాహ్నం LB స్టేడియం నుండి గద్దర్‌ (Gaddar) ఇంటివద్ద వరకు అంతిమయాత్ర (Gaddar final journey) కొనసాగింది. ఈ యాత్రలో పాల్గొన్న జహీరుద్దీన్ ..గద్దర్ ఇంటివద్దకు రాగానే ఛాతిలో నొప్పి అని సడెన్ గా కిందపడిపోయారు. వెంటనే ఆయన్ను పోలీసులు హాస్పటల్ […]

Published By: HashtagU Telugu Desk
siasat managing director zaheeruddin ali khan died

siasat managing director zaheeruddin ali khan died

గద్దర్ అంతిమ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. సియాసత్ ఉర్దూ పత్రిక (The Siasat Daily) మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ (Zaheeruddin Ali Khan) (63) గుండెపోటు (Heart stroke)తో మరణించారు. సోమవారం మధ్యాహ్నం LB స్టేడియం నుండి గద్దర్‌ (Gaddar) ఇంటివద్ద వరకు అంతిమయాత్ర (Gaddar final journey) కొనసాగింది. ఈ యాత్రలో పాల్గొన్న జహీరుద్దీన్ ..గద్దర్ ఇంటివద్దకు రాగానే ఛాతిలో నొప్పి అని సడెన్ గా కిందపడిపోయారు. వెంటనే ఆయన్ను పోలీసులు హాస్పటల్ కు తరలించారు. కాగా డాక్టర్స్ జహీరుద్దీన్ ను పరీక్షించి , అప్పటికి మృతి చెందినట్లు తెలిపారు. జహీరుద్దీన్ మరణ వార్త కుటుంబం లో విషాదాన్ని నింపింది.

ఎడిటర్‌గా జహీరుద్దీన్‌(Zaheeruddin Ali Khan)కి మంచి పేరుంది. గతంలో అనేక మంది ఆయన జర్నలిజంని కొనియాడారు. గతేడాది డిసెంబర్‌లో ఆయన్ను సౌదీకి చెందిన వ్యాపారవేత్తలు సన్మానించారు. ఇండియాన్ జర్నలిజంలో నిజాయితీతో కూడిన కమ్యూనిటీ సర్వీసెస్‌కు ఆయన్ను సత్కరించారు.

మరోపక్క గద్దర్ (Gaddar) అంత్యక్రియలు అల్వాల్ మహాబోధి స్కూల్ గ్రౌండ్స్ లో జరుగుతున్నాయి. బౌద్ధ మాత పద్ధతుల్లో గద్దర్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు జరుపుతున్నారు. గద్దర్ అంత్యక్రియ కార్యక్రమంలో రాజకీయ నేతలు , కళాకారులు పాల్గొన్నారు. జోహార్ గద్దర్ అంటూ తుది వీడ్కోలు పలుకుతున్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ గద్దర్ పార్థివదేహానికి నివాళ్లు అర్పించి , కుటుంబ సబ్యుఅల్ను ఓదార్చారు.

  Last Updated: 07 Aug 2023, 07:55 PM IST