SI: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉట్కూర్ ఎస్‌ఐను సస్పెండ్ అయ్యాడు. నారాయణపేట జిల్లా, ఊట్కూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బిజ్జ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మల్టీ జోన్-II, హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఊట్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందించకుండా బాధ్యతాయుతమైన స్టేషన్ హౌస్ అధికారి హోదాలో ఉన్న బిజ్జ శ్రీనివాసులు తీవ్ర నిర్లక్ష్యం, దురుసుగా ప్రవర్తించినట్లు ఐజీపీ దృష్టికి వచ్చింది.
బిజ్జ శ్రీనివాసులుపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ప్రక్రియలో ఉన్నారు. లభ్యమైన మెటీరియల్, కేసు పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించిన తరువాత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బిజ్జ శ్రీనివాసులును సస్పెన్షన్‌లో ఉంచడం అవసరమని ఐజిపి నిర్ణయించారు. అయితే పోలీసు శాఖలో కొంతమంది పవర్ ను అడ్డంపెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఏమైనా ఆరోపణలు వస్తే వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.