Site icon HashtagU Telugu

SI Affair With Constable: మహిళా కానిస్టేబుల్‌తో ఎస్సై ఎఫైర్‌.. చ‌నిపోయేందుకు అనుమ‌తివ్వాల‌ని కోరిన భార్య‌!

SI Affair With Constable

SI Affair With Constable

SI Affair With Constable: నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం (SI Affair With Constable) పెట్టుకొని, తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన వ్య‌క్తం చేశారు. ఎస్ఐ మహేందర్ తనను పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలు కని వదిలేసి.. గత రెండేళ్లుగా వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, వేరు కాపురం పెట్టాడని జ్యోతి వాపోయింది. తమ కుటుంబం మొత్తానికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వమ‌ని.. లేదంటే న్యాయం చేయండంటూ కలెక్టర్‌ను ఎస్ఐ మహేందర్ భార్య జ్యోతి వేడుకున్నారు.

అయితే పోలీస్ శాఖ‌లోని ఉన్న‌తాధికారుల‌కు చెప్పినా ఫ‌లితం లేక‌పోవ‌టంతో క‌లెక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు బాధితురాలు తెలిపింది. అక్ర‌మ సంబంధం వ‌ల‌నే భ‌ర్త త‌న‌ను వ‌దిలేశాడ‌ని ఆమె ఆవేద‌నం చెందారు. ఎవ‌రూ న్యాయం చేయ‌క‌పోవ‌డంతో చావే త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మ‌ని ఆమె పేర్కొన్నారు. ఉన్న‌తాధికారులు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌టంలేద‌ని, భ‌ర్త సైతం త‌న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి త‌న‌న‌కు హ‌త‌మార్చేందుకు కుట్ర‌లు చేస్తున్నాడ‌ని క‌లెక్ట‌ర్‌కు చెప్పుకున్నారు.

Also Read: Free Transport Facility: మందుబాబుల‌కు గుడ్ న్యూస్‌.. నేడు ఉచిత రవాణా స‌దుపాయం

అయితే ఎస్సై అక్ర‌మ సంబంధం ఎప్పట్నుంచో ఉంద‌ని ఈ విష‌యం స్థానిక అధికారుల‌కు తెలుస‌ని ఆమె వివ‌రించారు. చేస్తే న్యాయం చేయాల‌ని లేదంటే త‌మ‌కు కారుణ్య మ‌ర‌ణాల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని జ్యోతి కోరుతున్నారు. త‌మ అవ‌యవాల‌ను దానం చేస్తామ‌ని కూడా చెబుతుంది. మ‌రీ క‌లెక్ట‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

అయితే పోలీస్ శాఖ‌లో ఇటువంటి ఘ‌ట‌న‌లు ఇలాంటివి ఎక్కువ‌య్యాయ‌ని వీటిపై ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్ర‌మ సంబంధం కార‌ణంగానే ఇటీవ‌ల ముగ్గురు డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు చెరువులోకి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.