Shubman Gill: వెస్టిండీస్ పర్యటనలో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్. అయితే పేలవమైన ఫామ్‌ను భారత జట్టుకు ఆందోళన కలిగించకూడదని అభిప్రాయపడ్డాడు. అభినవ్ ముకుంద్.
గిల్ శుబ్మాన్ గిల్ 2023 వ సంవత్సరంలో అద్భుతంగా రాణించాడు. వన్డేలలో డబుల్ సెంచరీతో సహా మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ 2023 గుజరాత్ ని ఫైనల్ కు చేర్చాడు. గత సీజన్ ఐపీఎల్ అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. అయితే వెస్టిండీస్ టూర్‌లో పెద్దగా రాణించట్లేదు.టెస్టు సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌లలో గిల్ 45 పరుగులు మరియు వన్డేల్లో 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
గిల్ ప్రదర్శనపై ముకుంద్ అభినవ్ జియో సినిమాతో మాట్లాడుతూ… గత కొన్నేళ్లుగా శుబ్‌మాన్ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే అన్ని ఫార్మాట్‌లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వన్డేల్లో శుభ్‌మన్ గిల్ అగ్రశ్రేణి ఆటగాడు.అతను ప్రపంచ కప్‌కు వెళ్లాలని నేను భావిస్తున్నాను. అతను మళ్ళీ అద్భుతమైన ఆటతో తిరిగి వస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని చెప్పాడు.
Also Read: CM KCR: క్రిస్టియన్ల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి