జూన్ 05 నుంచి జూన్ 11 శనివారం వరకు…ఈ వారంలోని 7రోజులు వివాహానికి అనుకూలమైన సమయాలు. ఈ వారంలో నామకరణం, గృహ ప్రవేశం, పుట్టువెంట్రుకలు, ఉపనయనం, షాపింగ్ కోసం కొన్ని శుభ సమయాలు కూడా ఉన్నాయి. ఈ ఏడు రోజుల్లో ఏదైనా శుభకార్యాలు…లేదా ఆస్తి, వాహనం, కొనుగోలు చేయాలనునకుంటే ఈ శుభ ముహుర్తాలను చూడవచ్చు. హిందూ మతంలో ఏదైనా మంచి పనిచేసేముందు శుభ ముహుర్తం చూడటం అలవాటి. అలా చేస్తే చేపట్టిన పని ఆటంకం లేకుండా పూర్తి అవుతుంది. కాగా ఈ ఏడు రోజులు ఎలాంటి శుభముహుర్తాలు ఉన్నాయో పండితులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
జూన్ 2022 రెండవ వారం శుభ ముహూర్తం..
నామకరణం ముహూర్తం..
జూన్ రెండవ వారంలో మీ బిడ్డకు నామకరణం చేయాలనుకుంటే జూన్ 09 ,10 దీనికి అనుకూలమైన తేదీలు.
వివాహ ముహూర్తం..
ఈ ఏడు రోజులూ వివాహానికి శుభప్రదమే. జూన్ 05, 06 ,07, 08, 09, 10, 11 మీరు మీ సౌలభ్యం ప్రకారం వివాహం కోసం ఏ రోజైనా సరే నిర్ణయించుకోవచ్చు.
గృహ ప్రవేశ ముహూర్తం..
కొత్త ఇంటి గృహ ప్రవేశం పొందాలనుకునే వారికి,.. ఈ వారంలో ఒక రోజు మాత్రమే శుభ సమయం ఉంది. ఈ వారంలో, జూన్ 10వ తేదీ శుక్రవారం ఉదయం 05:22 గంటల నుండి తర్వాతి రోజు తెల్లవారుజామున 03:37 గంటల వరకు గృహ ప్రవేశానికి అనుకూల సమయం ఉంది.
పుట్టువెంట్రుకల ముహూర్తం..
మీరు ఈ వారం మీ కొడుకు లేదా కూతురికి పుట్టువెంట్రుకలు తీయాలనుకుంటే జూన్ 9 ,10 శుభ ముహూర్తాలలో ఈ శుభ కార్యాన్ని చేయవచ్చు.
ఉపనయన ముహూర్తం..
జూన్ 10 శుక్రవారం ఉపనయనం లేదా జానేయులకు శుభప్రదమైన రోజు. ఈ రోజున తెల్లవారుజామున 05.23 గంటల నుండి మధ్యాహ్నం 02.56 గంటల వరకు శుభముహూర్తం ఉంది.