Shreyas Iyer: టీమిండియాకు బిగ్ షాక్.. 5 నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్న అయ్యర్..!

IPL 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) రూపంలో బ్యాడ్ న్యూస్ వెలువడింది. స్టార్ బ్యాట్స్‌మెన్ తన వెన్ను గాయం కారణంగా IPL 2023, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరంగా ఉండనున్నాడు.

  • Written By:
  • Publish Date - March 22, 2023 / 12:21 PM IST

IPL 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) రూపంలో బ్యాడ్ న్యూస్ వెలువడింది. స్టార్ బ్యాట్స్‌మెన్ తన వెన్ను గాయం కారణంగా IPL 2023, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరంగా ఉండనున్నాడు. IPLలో KKR కెప్టెన్ అయ్యర్. వెన్ను గాయం కారణంగా అయ్యర్ శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంటుంది. దాని కారణంగా అతను సుమారు 5 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో అయ్యర్ వెన్నునొప్పి గురించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

సర్జరీ చేయాలని డాక్టర్ సూచన

స్పోర్ట్స్ టాక్‌లోని నివేదిక ప్రకారం.. అయ్యర్ తన వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంటుంది. దీని కారణంగా అతను చాలా కాలం పాటు టీమ్ ఇండియాకు దూరంగా ఉండనున్నాడు. అలాగే ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా దూరమవుతాడు. స్పోర్ట్స్ టాక్‌తో ఓ అధికారి మాట్లాడుతూ.. అయ్యర్ ముంబైలోని డాక్టర్‌తో టచ్‌లో ఉన్నారు. మూడవసారి డాక్టర్‌ని సందర్శించినప్పుడు అతనికి శస్త్రచికిత్స చేయమని సలహా ఇచ్చారని అధికారి తెలిపారు. ఈ కారణంగా అయ్యర్ IPL, ఇతర ముఖ్యమైన టోర్నమెంట్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. అయ్యర్ లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఆపరేషన్ కోసం సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎందుకంటే BCCI ఇంకా ఆపరేషన్ స్థానాన్ని ఖరారు చేయలేదు. భారతదేశంలో శస్త్రచికిత్స చేసే అవకాశం ఉందని ఆ అధికారి పేర్కొన్నారు.

Also Read: IPL 2023: పంజాబ్‌ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం

శ్రేయాస్ అయ్యర్ IPL 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా కనిపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ 16వ సీజన్‌లో అతని స్థానంలో ఎవరు జట్టు బాధ్యతలు చేపడతారనేది చూడాలి. గత సీజన్‌లో అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ 14 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అయ్యర్ ఔట్‌తో.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు  భారత జట్టుకు గట్టి దెబ్బ తగలనుంది. శ్రేయాస్ అయ్యర్ గతంలో కూడా వెన్నుపోటు కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.