Site icon HashtagU Telugu

Shreyas Iyer: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా శ్రేయాస్ అయ్యర్‌

Shreyas Imresizer

Shreyas Imresizer

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. ఫిబ్రవరి నెలలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనకు గాను అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించినట్లు ఐసీసీ పేర్కొంది. శ్రేయాస్ అయ్యర్ .. యూఏఈ ఆటగాడు వృత్య అరవింద్, నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఐరీలను వెనక్కినెట్టి ఈ అవార్డును కైవసం చేసుకున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఇక అంతకుముందు వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో 80 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ ఆ తరువాత మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ చివరి మ్యాచ్లో 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు.

అనంతరం శ్రీలంకతో టీ20 సిరీస్ లో మూడు మ్యాచ్ లలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిన శ్రేయాస్ అయ్యర్ వరుసగా 57 పరుగులు , 74 పరుగులు , 73 పరుగులతో అజేయంగా నిలిచి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శనతో అయ్యర్‌ ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ దుమ్మురేపుతున్న శ్రేయాస్ అయ్యర్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 92 పరుగులు , రెండో ఇన్నింగ్స్ లో 67 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక మరో వైపు ఫిబ్రవరి నెలకు గాను మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ అమీలియా కేర్‌ దక్కించుకుంది. ఫిబ్రవరి నెలలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో కేర్‌ దుమ్మురేపింది.