Site icon HashtagU Telugu

New Disease in Alcohol: మద్యం తాగే వారికి షాకింగ్ న్యూస్.. బయటపడ్డ మరో వ్యాధి.. తెలంగాణలో తొలి కేసు..

1351763 I

1351763 I

New Disease in Alcohol: మద్యం తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకే మద్యం తాగడం ఆరోగ్యానికి హనికరమని మద్యం బాటిల్స్ పై స్టిక్టర్ల ద్వారా, ప్రసారమాధ్యమాల్లో ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. కానీ ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా మద్యం తాగే వారు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. చిన్న వయస్సులో మద్యానికి బానిపై అనారోగ్యాల పాలవుతున్నారు. కిడ్నీ, గుండెపోటు లాంటి ఎన్నో సమస్యలు మద్యం తాగేవారికి వస్తాయి.

ఇవే కాకుండా తాజాగా మరో కొత్త వ్యాధి కూడా మద్యం తాగేవారికి వస్తుందట. అందే ఆల్కహాల్ అలర్జి. మీకు వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా.. మద్యం తాగేవారిలో చాలామంది ఆల్కహాల్ అలర్జీ బారిన పడుతున్నారు. ఈ అలర్జీ ఉన్నవారికి ఒంటిపై ఎర్రటి దద్దుర్లు క నిపిస్తున్నాయి. దేశంలోనే తొలిసారి ఈ వ్యాధిని హైదరాబాద్ లో డాక్టర్లు కనుగొన్నారు.

దేశంలో మొదటి లిక్కర్ అలర్జీ కేసు నమోదైంది. హైదరాబాద్ అశ్విని హాస్పిటల్ లో మద్యం అలర్జీ కేసు నిర్ధారణ అయింది.ఇప్పటి దాకా ప్రపంచంలోని 100 కుపైగా ఇలాంటి కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ దగ్గర ఆగ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ బిజినెస్‌మెన్‌కి ఆల్కహాల్ అలర్జీ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. కొన్ని వేల మందికి ఇలాంటి పరిస్థితి ఉండవచ్చని, నిర్ధారణ కాని పరిస్థితి ఉందని అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ వెల్లడించారు.

ఆగ్రా ప్రాంతానికి చెందిన జాన్ (36) తన మిత్రులతో కలిసి పార్టీలో పాల్గొన్నాడని, కబుర్ల అనంతరం అందరూ కలిసి మద్యాన్ని సేవించారని డాక్టర్ వ్యాకరణం తెలిపారు. అందరితో పాటు జాన్ మద్యం తాగాడని, సరిగ్గా 15 నిమిషాల తర్వాత ముఖమంతా ఎర్రబడి వేడిగా మారడం, చర్మంపై దురదలు రావడం, ఛాతీ బరువుగా అనిపించడంతో పాటు ఆయాసం వంటి లక్షణాలు కనిపించాయట

Exit mobile version