High Heels: అమ్మాయిలకు షాకింగ్ న్యూస్.. హైహీల్స్ వాడితే ఎంత ప్రమాదకరమో తెలుసా?

చాలామంది అమ్మాయిలు హైహీల్స్ వాడుతూ ఉంటారు. ఎత్తు ఎక్కువగా కనిపించడానికి అమ్మాయిలు హైహీల్స్ ధరిస్తూ ఉంటారు. పొట్టిగా ఉన్న అమ్మాయిలు ఎత్తుగా కనిపించడానికి హైహీల్స్ ధరిస్తూ ఉంటారు. ఇటీవల ఎక్కువమంది అమ్మాయిలు హైహీల్స్ వాడుతున్నారు.

  • Written By:
  • Publish Date - April 16, 2023 / 08:53 PM IST

High Heels: చాలామంది అమ్మాయిలు హైహీల్స్ వాడుతూ ఉంటారు. ఎత్తు ఎక్కువగా కనిపించడానికి అమ్మాయిలు హైహీల్స్ ధరిస్తూ ఉంటారు. పొట్టిగా ఉన్న అమ్మాయిలు ఎత్తుగా కనిపించడానికి హైహీల్స్ ధరిస్తూ ఉంటారు. ఇటీవల ఎక్కువమంది అమ్మాయిలు హైహీల్స్ వాడుతున్నారు. అయితే హైహీల్స్ వాడటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. హైహీల్స్ ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి చాలా ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

హైహీల్స్ అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ ఫ్యాషన్ మోజులో పడి హైహీల్స్ వాడితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు డాక్టర్లు. అప్పుడప్పుడు వాడితే ఫరవాలేదు కానీ రోజూ గంటల తరబడి వాడితే మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. దాని వల్ల మంచి కంటే హాని ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. హైహిల్స్ కు బదులు వెడ్జస్ వాడటం మంచిదని, వీటి వల్ల శరీరంపై భారం పడదని అంటున్నారు.

హైహీల్స్ ఎక్కువగా వాడటం వల్ల వెన్ను కింద భాగంలో నొప్పి వస్తుందని, అవి పాదాలకు సపోర్ట్ గా ఉండవని చెబుతున్ారు. ఒక్కోసారి నొప్పులు పుట్టడం, పుండ్లు రావడం వంటివి జరుగుతాయని అంటున్నారు. ఇక పాదాల్లో నొప్పి వస్తుందని, పాద సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక నరాల వ్యవస్థపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయని, మడమల ప్రాంతంలో తిమ్మిర్లు రావడం, జలదరింపుగా అనిపిస్తుందని అంటున్నారు.

ఇక ఎముకలు బలహీనంగా మారుతాయని, ఇక హైహీల్స్ వేసుకున్నప్పుడు స్లిప్ అయి పడితే ఫ్రాక్చర్లు అవ్వడంతో పాటు నడుము, తుంటి ఎముకలు విరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇక వెన్నునొప్పి సమస్య వస్తుందని, కండరాల నొప్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.