Site icon HashtagU Telugu

Snake Bite : చిన్నారిని కాటేసి అక్కడే చచ్చిన పాము.. పగ వల్లే పాము చచ్చిందా?

Cf8e0eaf Fce8 48f3 889d 1c0f2dff7b21

Cf8e0eaf Fce8 48f3 889d 1c0f2dff7b21

మామూలుగా పాములు కనిపిస్తే పరుగులు తీస్తూ ఉంటాము. ఆ పాములు మనల్ని ఎక్కడ కాటేస్తాయో మనకు ఎక్కడ హాని కలిగిస్తాయో అని భయంతో పరుగులు పెడుతూ ఉంటారు. అయితే చాలామంది భయపడినట్టు గానే ఎంతోమంది ఈ పాముకాటు వల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ పాముల లో కూడా కొన్ని విష సర్పాలు ఉన్నాయి. అవి కాటేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మనుషుల చనిపోతూ ఉంటారు. కానీ తాజాగా బీహార్ లో జరిగిన ఒక సంఘటన మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.. ఒక విషపూరితమైన పాము నాలుగేళ్ల చిన్నారి కాటు వేసిన మరుక్షణంలోనే చనిపోయింది.

అయితే ఈ సంఘటనలో ఆశ్చర్యపోవాల్సిన మరొక విషయం ఆ పాము కాటేసిన ఆ నాలుగేళ్ల చిన్నారి ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే వినడానికి నమ్మశక్యంగా లేక పోయినప్పటికీ ఇది మాత్రం నిజం. బీహార్‌లోని గోపాల్‌గంజ్ ప్రాంతానికి చెందిన 4ఏళ్ల అంజు కుమార్ అనే బాలుడు ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో అక్కడకు విషసర్పం వచ్చి ఆ నాలుగేళ్ల బాలుడిని కాటేసింది. దీంతో వెంటనే ఆ చిన్నోడు ఏడుస్తూ ఇంట్లోకి పరుగులు తీశాడు. అనంతరం తనకు పాము కుట్టిందని కుటుంబ సభ్యులకు వెల్లడించాడు.

ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే ఇంటి ప్రాంగణం నుంచి కొద్ది దూరం వెళ్లిన పాము అక్కడే మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ చిన్నారితోపాటు చనిపోయిన పామును కూడా తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ అంజు కుమార్‌ కు వైద్యలు చికిత్స చేశారు. అనంతరం అతడు ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ బాలుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అంజు కుమార్‌ను కాటేసిన మరుక్షణంలోనే ఆ పాము చనిపోయిందని చెప్పారు. బాబును హాస్పిటల్‌కు తీసుకెళ్లాలనే ఆలోచనతో దానికి ఎవరూ హాని తలపెట్టలేదని పేర్కొన్నారు. చనిపోయిన పామును, అంజు కుమార్‌ను చూసేందుకు హాస్పిటల్ వద్ద జనం ఎగబడ్డారు. ఇదిలా ఉంటే ఆ విషసర్పం మరణించడానికి గల కారణం తెలియరాలేదు.