Site icon HashtagU Telugu

Shocking: బిహార్ లో దారుణం, ప్రియుడి మ‌ర్మాంగాన్ని కోసిన ప్రియురాలు

Crime

Crime

బిహార్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ జంట మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియుడు ప్రియురాలికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విష‌యం తెలిసిన‌ ప్రియురాలు తీవ్ర మ‌న‌స్తాపంతో కుంగిపోయింది. న‌మ్మిన ప్రియుడే వంచించాడ‌నే ఆలోచ‌న ఆమెను ఆగ్ర‌హంతో ర‌గిలిపోయేలా చేసింది. స‌ద‌రు ప్రియుడు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో సీఆర్పీఎఫ్ జ‌వాన్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. త‌న బంధువుల అమ్మాయితో మూడేళ్లుగా ప్రేమ‌లో ఉన్న అత‌ను.. ఇటీవ‌లే ఆమెను ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నాడు.

అయితే ఈ నెల 23న అత‌నికి వేరొక యువ‌తితో పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌న్న విష‌యం ప్రియురాలికి తెలిసింది. ఆగ్ర‌హంతో ర‌గిలిపోయిన ఆమె ప్రియుడిపై క‌క్ష తీర్చుకోవాల‌ని భావించింది. బిహార్‌లోని ప‌ట్నాలో గ‌ల ఓ హోట‌ల్‌కు ప్రియుడిని ర‌ప్పించింది. ఇద్ద‌రూ ఏకాంతంగా ఉన్న స‌మ‌యంలో ప‌దునైన ఆయుధంతో ప్రియుడి మ‌ర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘ‌ట‌న‌తో పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. బాధితుడు ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read: Indian Railway Jobs: రాత పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాలు.. 10వ త‌ర‌గ‌తి పాస్ అయితే చాలు..!