Shocking: విమానంలో షాకింగ్ పరిణామం.. గాల్లో ఉండగా చోరీకి గురైన మద్యం..

విమానంలో ఇటీవల వివాదాస్పద విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికులు తోటి ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించడం, విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో డోర్లు తీయడం లాంటివి చోటుచేసుకుంటూ ఉంటాయి.

  • Written By:
  • Updated On - March 30, 2023 / 09:25 PM IST

Shocking: విమానంలో ఇటీవల వివాదాస్పద విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికులు తోటి ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించడం, విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో డోర్లు తీయడం లాంటివి చోటుచేసుకుంటూ ఉంటాయి. అలాగే ప్రయాణికులపై విమానంలో మూత్రం పోయడం లాంటి ఘటనలు ఇటీవల తీవ్ర దుమారానికి రేపాయి. ఈ ఘటనల్లో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

అయితే తాజాగా మరో ఆశ్చర్యకర ఘటన విమానంలో చోటుచేసుకుంది. విమానంలో ఓ ప్రయాణికుడి విస్కీ బాటిల్‌లోని మద్యం చోరీకి గురైంది. దీంతో ఖంగుతిన్న ప్రయాణికుడు దీనిపై ఎయిర్‌లైన్స్ సంస్థకు ఫిర్యాదు చేశాడు. ట్విట్టర్‌లో ఎయిర్‌లైన్స్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతానికి చెందిన క్రిస్టోఫర్ ఆంబ్లర్ అనే వ్యక్తి ఇటీవల విమానంలో ప్రయాణించాడు.

అయితే ఖరీదైన విస్కీ బాటిల్‌ను తన బ్యాగులో పెట్టుకున్నాడు. అయితే గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత చూసుకుంటే బాటిలో‌ని మద్యం తగ్గింది. బాటిల్‌లోని మూడింట ఒక వంతు మద్యం మాయమైంది. ఈ విస్కీ బాటిల్ ధర రూ.45,556గా ఉంది. దీంతో మద్యం చోరీకి గురి కావడంతో దీనిని ఫొటో తీసి ట్విట్టర్‌లో ఎయిర్‌లైన్స్‌కు ఫిర్యాదు చేస్తూ ట్యాగ్ చేశాడు. విమాన సిబ్బందే తాగేసి ఉంటారని ఆరోపించాడు.

బ్యాగులో ఎటువంటి లీకేజీ లేదని, అలాగే బాటిల్ సీల్ చేసి ఉందని తెలిపాడు. కానీ తర్వాత చూసుకుంటే సీల్ తీసి ఉందని, విమాన సిబ్బంది తాగేసి ఉంటారని ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్.. ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పింది. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రయాణికుడే తాగేసి నాటకాలు ఆడుతున్నాడంట కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మద్యం విమాన సిబ్బంది తాగేసి ఉంటారని అతను చెబుతున్నదానికి సాక్షం ఎంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.