Hyderabad: షాకింగ్.. పోలీసుల పేరుతో 18.5 లక్షలు దోచేశారు!

ఎన్నికల కోడ్ ను తనకు అవకాశంగా మలుచుకున్నాడు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసుల పేరుతో ఏకంగా 18 లక్షలు కొట్టేశాడు!

  • Written By:
  • Updated On - October 27, 2023 / 03:11 PM IST

Hyderabad: హైదరాబాద్‌లో చెకింగ్‌ పేరుతో ఓ ప్రైవేట్‌ ఉద్యోగి నుంచి రూ.18.5 లక్షలు దోచుకెళ్లిన ఘటన చర్చనీయాంశమవుతోంది. వివరాల ప్రకారం.. మెహిదీపట్నంలోని చిమన్‌లాల్‌ సురేష్‌ కుమార్‌ టెక్స్‌టైల్స్‌లో పనిచేస్తున్న అక్షయ్‌ తన వద్ద పనిచేసే వర్కర్ ప్రదీప్‌ శర్మకు రూ.20 లక్షలు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాగుట్ట బ్రాంచ్‌లో డిపాజిట్‌ చేసేందుకు ఇచ్చాడు. ప్రదీప్ తన ఆఫీస్ డ్రైవర్ శంకర్‌తో కలిసి గురువారం రాత్రి 9:15 గంటలకు తాజ్ కృష్ణా రోడ్‌లో తెల్లటి ఇన్నోవా వచ్చాడు.

పోలీసు అధికారులుగా చెప్పుకునే వ్యక్తులు ప్రదీప్‌ను అతను తీసుకువెళుతున్న డబ్బు, ఇతర వివరాల గురించి తెలుసుకున్నారు. 20 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్న వ్యక్తులు ప్రదీప్‌ను ఇన్నోవాలో కూర్చోబెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర బ్యాగ్‌ని తిరిగి ప్రదీప్‌కి అందించి విడిచిపెట్టారు. బ్యాగ్‌ని పరిశీలించగా రూ.1.5 లక్షలు మాత్రమే మిగిలి ఉండగా, రూ.18.5 లక్షలు కనిపించలేదు. ప్రదీప్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Also Read: Onion Prices: మళ్లీ ఉల్లి లొల్లి.. కేజీ రూ.53పైనే