Site icon HashtagU Telugu

Flight: షాక్.. సగం దూరం ప్రయాణించిన ఫ్లైట్ వెనక్కి.. సేఫ్ ల్యాండ్!

Aa14we9n

Aa14we9n

Flight: ఈ మధ్య ఫ్లైట్ ప్రమాదాలు, విమాన సాంకేతిక లోపాలు జరగడం వంటి సంఘటనలు అధికంగా జరుగుతున్నాయి. విమాన సిబ్బంది లేదా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడమా అవంతి సంఘటనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయి కూడా. విమానయాన సంస్థలు పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని సార్లు వాతావరణ కారణాలు కూడా ఇలాంటి సంఘటనలకు కారణం అవుతున్నాయి.

ఇలాంటి ఘటనే ఈ రోజు ఓ విమానంలో జరిగింది. టేక్ ఆఫ్ అయిన ఒక విమానం 13 గంటలు గాల్లో ప్రయాణించి తిరిగి టేక్ ఆఫ్ అయిన విమానాశ్రయానికి వచ్చి ల్యాండ్ అయ్యింది. మొత్తానికి సేఫ్ ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ నుండి ఆక్లాండ్ వెళ్లాల్సిన ఈకే448 విమానం ఉదయం 10.30 గంటలకు టేకాఫ్‌ అయింది. మొత్తం 9000 మైళ్ళ దూరం ప్రయాణించాల్సిన ఈ విమానం దాదాపు సగం దూరం ప్రయాణించి, మళ్ళీ యూటర్న్ తీసుకుని దుబాయ్ వచ్చి ల్యాండ్ అయిపోయింది.

అసలు విషయం ఏంటంటే.. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ ఎయిర్‌పోర్టులో వరదలు పోటెత్తడంతో ఆ విమానాశ్రయాన్ని మూసివేశారు. కావున అక్కడ విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. దీనితో సమాచారం అందుకున్న పైలట్.. విమానాన్ని యూటర్న్ తీసుకుని తిరిగి దుబాయ్ వైపు మళ్ళించాడు. దీనితో టేక్ ఆఫ్ అయిన చోటే వచ్చి మళ్ళీ ల్యాండ్ అయ్యింది ఆ విమానం. ఆక్లాండ్ లో వరదలు భారీగా రావడంతో దుబాయ్ నుండి బయల్దేరిన ఆ ఎమిరేట్స్‌ విమానం వెనక్కి రాకతప్పలేదు. మొత్తానికి ఈ సంఘటన అందర్నీ ఇబ్బందికి గురి చేసింది.

ఈ సంఘటన వాతావరణ కారణాల వల్ల సంభవించిందని, దీని వల్ల ప్రయాణికులతో పాటు, సిబ్బందికి అత్యంత ఇబ్బంది కలిగిందని సదరు విమానయాన సంస్థ ప్రకటించింది. ఏదేమైనా ప్రయాణికుల భద్రత తమకు ప్రధానమని పేర్కొన్నారు. కొంతమంది సేఫ్ గానే ఉన్నామని సంతోషిస్తుండగా.. మరికొంత మంది ప్రయాణికులు చాలా టైమ్ వేస్ట్ అవుతుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అయితే దీనివల్ల ఎంత నష్టం వాటిల్లనుందని టర్మినల్ అధికారులు ఇప్పుడే ఏమి చెప్పలేమని ప్రకటించారు.

Exit mobile version