Site icon HashtagU Telugu

AP High Court: ఏపీలో వాహనదారులకు షాక్.. ఇకపై ఆ వాహనాలు సీజ్?

Ap High Court

Ap High Court

AP High Court: కర్ణాటకలో బైక్ మీద వెళ్లేవారందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. బైక్ వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. దీనిని కఠినంగా అమలు చేస్తూ, అక్కడి ట్రాఫిక్ పోలీసులు అందరూ ఈ నియమం తప్పక పాటిస్తున్నారు. హెల్మెట్ ధరించని వారు ఛలాన్ కూడా ఎదురుకుంటున్నారు. ఇక్కడ కర్ణాటక లో, రూల్ ప్రకారం ఎంత సీరియస్‌గా అమలవుతుందో, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఏపీ లో, హెల్మెట్ పెట్టుకునేవారి సంఖ్యా చాలా తక్కువ. దాంతో, హెల్మెట్ పెట్టుకునేవారిని చుట్టుపక్కల వారు చూసి నవ్వుతున్నారు. “ఆ హెల్మెట్ పెట్టుకునే అవసరం ఉందా?” అనే దృష్టితో చూస్తున్నారు. ఆ దశలో, హెల్మెట్ పెట్టుకోవాలని అనుకున్న వాళ్లు కూడా ఆ ఆలోచనను విడిచి వేయడం ప్రారంభించారు. ఈ పరిస్థితి చూసిన ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్రంలో 99 శాతం మంది హెల్మెట్ పెట్టుకోకుండా బైక్‌ వాహనాలు నడిపిస్తున్నారని మండిపడింది. “హెల్మెట్ లేకుండా బైకులు ఎలా నడుపుతున్నారు?” అని ప్రశ్నిస్తూ, “రూల్స్ ఎందుకు పాటించటం లేదు?” అంటూ తీవ్రంగా నిలదీశింది. ఈ అంశంపై ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలైంది. దానికి స్పందిస్తూ, కోర్టు, “బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాదు, వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి” అని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా హెల్మెట్ ధరించకుండా టూ-వీలర్ నడిపితే, వారికి ఫైన్ వేశేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఆ ఫైన్‌ ను 90 రోజుల్లో చెల్లించకపోతే, వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నిర్ణయంతో పాటు, హైకోర్టు ఇంకా ఒక కీలక ఆదేశం ఇచ్చింది. హెల్మెట్ ఫైన్, 90 రోజుల గడువు, వాహనం స్వాధీనం వంటి విషయాలను పేపర్లు, టీవీలు వంటి మీడియా ఛానెల్స్‌ లో యాడ్స్ రూపంలో ప్రజలకు తెలియజేయాలని ఆదేశించింది. అంతటితో కోర్టు ఈ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.