Sanjay Raut : సంజ‌య్ రౌత్ అరెస్ట్‌పై శివ‌సేన ఆగ్ర‌హం.. రాజ్య‌స‌భ‌లో…?

భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టుపై ఆ పార్టీ నేత‌లు సీరియ‌స్‌గా ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Shivasena

Shivasena

భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టుపై ఆ పార్టీ నేత‌లు సీరియ‌స్‌గా ఉన్నారు. పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది సోమవారం రాజ్యసభలో రూల్ 267 ప్రకారం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడాన్ని పేర్కొంటూ నోటీసును ఇచ్చారు. అయితే ఈ నోటీసును రాజ్య‌స‌భ చైర్మ‌న్ సస్పెండ్ చేశారు. రూ. 1,034 కోట్ల పట్రా చావల్ ల్యాండ్ స్కామ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రౌత్‌ను అర్ధరాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం సంజ‌య్ రౌత్‌ను కేంద్ర ఏజెన్సీ కస్టడీలోకి తీసుకుంది. ఈడీ సంజ‌య్ రౌత్‌కు అనేక సార్లు సమన్లు ​జారీ చేసింది. దీంతో ఆయ‌న హ‌జ‌రుకాక‌పోవ‌డంతో అరెస్ట్ చేశారు. ఈ ఉదయం అతడిని ముంబై కోర్టులో హాజరుపరచనున్నారు.

  Last Updated: 01 Aug 2022, 11:49 AM IST