Site icon HashtagU Telugu

Shiv Nadar: రూ. 2042 కోట్లు విరాళంగా అందించిన శివ నాడార్.. అంటే రోజుకు రూ.5.6 కోట్ల విరాళం..!

Shiv Nadar

Compressjpeg.online 1280x720 Image 11zon

Shiv Nadar: దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ శివ్ నాడార్ (Shiv Nadar) అతిపెద్ద దాతృత్వవేత్తగా అవతరించారు. 2023-23 ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్ రూ. 2042 కోట్లు విరాళంగా అందించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 76 శాతం ఎక్కువ. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. ఎడెల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2023 ప్రకారం శివ్ నాడార్ రూ. 2042 కోట్లు విరాళంగా ఇవ్వడం ద్వారా దేశంలోనే అత్యంత ఉదార వ్యాపారవేత్తగా మారారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజు సగటున రూ. 5.6 కోట్లు విరాళంగా ఇచ్చారు. శివ నాడార్ తర్వాత విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ రెండో స్థానంలో ఉన్నారు. 2022-23లో ఆయన మొత్తం రూ.1774 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే 267 శాతం ఎక్కువ.

We’re now on WhatsApp. Click to Join.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ విరాళాల పరంగా మూడో స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా రూ.376 కోట్లు విరాళంగా ఇచ్చారు. జెరోధాకు చెందిన నిఖిల్ కామత్ అత్యంత పిన్న వయస్కుడైన దాతగా నిలిచాడు. 112 కోట్లు విరాళంగా అందించిన ఆయన 12వ స్థానంలో ఉన్నారు. మహిళా దాతల్లో రోహిణి నీలేకని మొదటి స్థానంలో నిలిచి రూ.170 కోట్లు విరాళంగా అందించారు.

Also Read: Elon Musk Son : కొడుకుకు భారత శాస్త్రవేత్త పేరు పెట్టుకున్న ఎలాన్ మస్క్ 

రోహిణి నీలేకని కాకుండా ఇతర స్వచ్ఛంద మహిళల పేర్లను పరిశీలిస్తే అను అగా, లీనా గాంధీ రూ. 23 కోట్లు విరాళంగా అందించారు. ఇద్దరూ 40, 41 స్థానాల్లో ఉన్నారు. మొత్తం దాతలలో 7 మంది మహిళా దాతలు ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 119 మంది పారిశ్రామికవేత్తలు రూ. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు ఇచ్చారు. మరి వీటన్నింటి విరాళాలను కలిపితే ఈ మొత్తం రూ.8445 కోట్లు అవుతుంది. ఈ మొత్తం 2021-22 కంటే 59 శాతం ఎక్కువ. 2022-23లో 14 మంది భారతీయులు రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చారు. ఇది అంతకు ముందు సంవత్సరంలో కేవలం 6 మాత్రమే. కాగా 12 మంది రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చారు. 47 మంది రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చారు.