Linga Abhisekh: శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే.. ఎంత మంచి జరుగుతుందో తెలుసా?

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఒక వ్యక్తి కష్టపడి ఎదుగుతున్నాడు అంటే అతనికి చెయ్యి అందించి ధైర్యం

Published By: HashtagU Telugu Desk
Lard Shiva

Lard Shiva

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఒక వ్యక్తి కష్టపడి ఎదుగుతున్నాడు అంటే అతనికి చెయ్యి అందించి ధైర్యం ఇవ్వాల్సింది పోయి, అదే చేతిని పట్టుకొని వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఒక వ్యక్తి ఎదుగుతున్న కొద్దీ అతని చూసి సహించలేని, ఓరువలేని వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా అలా ఎదుగుతున్న వ్యక్తి ఒకవైపు నుంచి ప్రమాదాలకు దగ్గరగా వెళుతూ ఉంటాడు. అందుకు గల కారణం అతని ఎదుగుదల చూసి మెచ్చుకునే వారి కంటే శత్రువులుగా మారి సహించలేని వారిని ఎక్కువగా ఉంటారు.

ఇలా శత్రువులుగా మారిన వారు అతన్ని ఎలా అయినా కూడా ఎదగనివ్వకుండా చేయాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శత్రువులు ఎప్పుడూ కూడా ఇదే వ్యక్తిని మానసికంగానే దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్లాన్ లు వేసిన వర్కౌట్ కాకపోతే చివరికి ప్రాణాలు తీయడానికైనా కొంతమంది వెనకాడరు. కొంతమంది అయితే వారికి రావాల్సింది అవతలికి వ్యక్తికి దక్కినప్పుడు వారిపై కోపం పెంచుకొని శత్రువులుగా కూడా మారుతూ ఉంటారు. అయితే ఎదుగుతున్న వాడికి ఏ రూపంలో ఎలా కష్టం వస్తుందో చెప్పడం అంతేనా వేయడం చాలా కష్టం.

అటువంటి వారినీ ఆ పరమశివుడే రక్షించాలి. మరి ఆదిదేవుడు అయిన ఆ పరమశివుడికి ఏమి చేస్తే మనకు కృప కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ పరమశివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే తప్పకుండా ఆ శివుడు అనుగ్రహిస్తారు అని చెబుతోంది శాస్త్రం. ఆ పరమ శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల మనపై దాడి చేయడానికి శత్రువులు ఎన్ని ప్లాన్ లు, ఎన్ని కుట్రలు పన్నినా కూడా అవి ఫలించవు. వారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఈ పరమశివుడి అనుగ్రహం కలిగి వాళ్లు విజయమే సాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ అభిషేకం చేయడం వల్ల శత్రువులు దూరం కావడంతో పాటు, ఎవరైతే మనపై కోపంతో రగిలిపోతూ ఉంటారో అటువంటి శత్రువులు మిత్రులు కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుందట. శత్రువులు ఎక్కువగా ఉన్నవారు, ఎక్కువగా ఆటంకాలను ఎదుర్కొంటున్న వాళ్ళు శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల, శివ అనుగ్రహం పొంది విజయం సాధించవచ్చు.

  Last Updated: 20 Aug 2022, 12:32 AM IST