Site icon HashtagU Telugu

AP Students: అస్వస్థతకు గురైన శింగనమల కస్తూర్బా విద్యార్థులు

Food Sick

Food Sick

అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయంలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం తిన్న వీరంతా ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రానికి ఈ సంఖ్య 40కి చేరుకుంది.
దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే వారిని శింగనమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి 8మందిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పాఠశాలలో మొత్తం 200మంది విద్యార్థినులు ఉన్నారు. మధ్యాహ్నం వీరంతా పప్పు,అన్నం,రసం,మజ్జిగతో భోజనం చేసినట్లు సిబ్బంది తెలిపారు.