Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై పరస్పర విమర్శలు

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు విచారించింది. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరిస్తూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే నిర్ణయాన్ని తీసుకోలేమని,

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు విచారించింది. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరిస్తూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే నిర్ణయాన్ని తీసుకోలేమని, ఈ అంశాన్ని 7 మంది న్యాయమూర్తుల బెంచ్‌కు రిఫర్ చేసింది.

సుప్రీం కోర్టు నిర్ణయం తరువాత సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ధవ్ ఠాక్రేపై పలు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఉద్ధవ్‌కు సరైన సంఖ్యాబలం లేదని, అందుకే ఆయన నిష్క్రమణ ఖాయమని ఫడ్నవీస్ అన్నారు.

ఉద్ధవ్ నైతికత గురించి మాట్లాడకూడదని విమర్శించారు డిప్యూటీ సీఎం. ఇది ప్రజాస్వామ్యం, మాది ప్రజాస్వామ్య విజయమని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతృప్తిగా ఉన్నామని అన్నారు. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కుట్ర నేడు తేటతెల్లమైందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చట్టబద్ధమైనదని ఇప్పుడు, ఎవరికీ అనుమానం అక్కర్లేదని అన్నారు. నైతికత గురించి మాట్లాడటం ఉద్ధవ్ ఠాక్రేకు సరిపోదని ఫడ్నవీస్ అన్నారు. సిఎం పదవి కోసం ఎన్‌సిపి, కాంగ్రెస్‌తో చేతులు కలిపినప్పుడు ఉద్ధవ్ తన నీతిని మరచిపోయారా అని ప్రశ్నించారు. నైతిక కారణాలతో రాజీనామా చేయలేదని, ఓటమి భయంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

ఉద్ధవ్ ఠాక్రే నైతిక ప్రకటనపై సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా విరుచుకుపడ్డారు. ఠాక్రే నైతికతపై అంత శ్రద్ధ ఉంటే, ఆయన బీజేపీని అస్సలు వదిలిపెట్టేవారు కాదని ఆయన అన్నారు. కాగా.. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరిస్తూ, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే నిర్ణయాన్ని తీసుకోలేమని, ఈ అంశాన్ని 7 మంది న్యాయమూర్తుల బెంచ్‌కు రిఫర్ చేసింది.

Read More: RCP Singh: బీజేపీలో చేరిన జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్