Site icon HashtagU Telugu

Yoga Secrets:శిల్పాశెట్టి యోగా సీక్రెట్స్…ఈ ఆసనంతో ఏకగ్రాత సాధ్యమంటున్న బ్యూటీ…!

Shilpa Shetty Yoga Imresizer (1)

Shilpa Shetty Yoga Imresizer (1)

శిల్పాశెట్టి….ఈ పేరులోనే ఉన్నట్లుగా శిల్పి ఉలి పట్టుకుని చెక్కినట్లు ఉంటుంది ఆమె శరీర సౌష్టవం. 45ఏళ్ల ఈ భామ చెక్కుచెదరని సౌందర్యంతో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తూనే…దక్షిణాదిలోనూ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటి అయినప్పటికీ కూడా రియల్ లైఫ్ లో మాత్రం చాలా సరదగా ఉండటం ఈ బ్యూటీ ప్రత్యేకత.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. టిక్ టాక్ వీడియోలతో రచ్చ రచ్చ చేస్తూ…ఫ్యాన్స్ కు కావాల్సినంత వినోదాన్ని పంచింది ఈ భామ. టిక్ టాక్ నిషేధం తర్వాత…శిల్పా కొత్త దారి ఎంచుకున్నారు. యోగాసనాలు చేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తూ అలరిస్తున్నారు. యోగాసనాలు వేయడంలో తన నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో..శిల్పా వేసే భంగిమలే చెబుతున్నాయి. నడుముని విల్లులా వంచుతూ ఈ బ్యూటీ యోగాసనాలు చేయడం ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

యోగాతో రోజును ప్రారంభించడం కంటే మెరుగైంది ఇంకేమీ లేదంటోంది ఈ బ్యూటీ. అద్భుతమైన రోజు కోసం మనస్సు, శరీరం, ఆత్మను యోగా రెడీ చేస్తుందని ఈ మధ్యే శిల్పా ఇన్ స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు. ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో వృక్షాసనంతో ప్రారంభమయ్యే యోగా భంగిమల గురించి వివరించింది ఈ బ్యూటీ. తర్వాత వీరభద్రాసన భంగిమ, నటరాజసనం లాంటి భంగిమలను వేసి చూపించారు. ఈ వయస్సులో కూడా శిల్పా అంత ఈజీగా శరీరాన్ని వంచుతూ యోగాసనాలు చేయడాన్ని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఈ యోగాసనాలు క్రమం తప్పకుండా చేసినట్లయితే కీళ్ల నొప్పులు తగ్గడం, తొడ కండరాలు బలంగా ఉండటంతోపాటు కాళ్లు బలంగా ఉంటాయని చెబుతోంది. అంతేకాదు ఏకగ్రాత, వశ్యత, మనస్సును శరీరాన్ని సమన్వయం చేస్తుంది. యోగా చేసే సమయంలో మనం పీల్చే తాజా గాలి వీటిన్నింటికి బోనస్ అని చెబుతోంది సాగరకన్య. రక్తప్రసరణను మెరుగుపరచడంతోపాటుగా…చర్మాన్ని బిగువుగా ఉంచడంలో ఈ యోగాసనాలు సహాయపడుతాయట.