Site icon HashtagU Telugu

Shikhar Dhawan: ధావన్ కే పంజాబ్‌ కింగ్స్‌ పగ్గాలు ?

Sikhar Dhawan

Sikhar Dhawan

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం గ్రాండ్ సక్సెస్ గా ముగిసింది. ఇక ఈ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కీల‌కమైన ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. ఈసారి కచ్చితంగా ట్రోఫీ సాధించాలాని అనుకుంటున్న పంజాబ్‌ వేలంలో స్టార్ ఆటగాళ్లను దక్కించుకుంది. శిఖర్ ధావన్, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జానీ బెయిర్‌ స్టో, కగిసో రబాడ, ఓడియన్‌ స్మిత్‌, షారుక్‌ ఖాన్‌ లాంటి స్టార్ ప్లేయర్లను వేలంలో కొనుగోలు చేసింది. వీరిలో టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను పంజాబ్ కింగ్స్ 8.25 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది.Bఈ వేలంలో ఆటగాళ్లపై పంజాబ్‌ రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేసింది.. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌ను ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది.

మరో రెండు రోజుల్లో ఈ విషయాన్ని పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్లో ఇటు ఐపీఎల్ లో అపార అనుభవం ఉన్న శిఖర్ ధావన్‌ ను పంజాబ్‌ కింగ్స్ ఫ్రాంచైజీ జట్టు సారథిగా నియమించాలని అనుకుంటున్నాట్టు , మరో రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడనుంది అని పంజాబ్ కింగ్స్ అధికారి చెప్పుకొచ్చారు. గ‌త ఏడాది శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టుకు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించాడు. టీ20 ప్రపంచకప్‌-2021, స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ధావన్‌కు చోటు దక్క లేదు. ఇక ఐపీఎల్‌ మెగా వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ధావ‌న్‌ని రీటైన్ చేసుకోలేదు.