Site icon HashtagU Telugu

MI vs PBKS: ముంబైకి వరుసగా అయిదో ఓటమి

PBKS vs DC

Pbks Imresizer

ఐపీఎల్ 15వ సీజన్ లో ముంబై ఇందియన్స్ కు తొలి విజయం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. స్ జన్ ఆరంభం నుంచీ పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న ముంబై వరుసగా అయిదో మ్యాచ్ లో పరాజయం పాలైంది.
చివ‌రి వ‌ర‌కు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబైపై పంజాబ్ కింగ్స్ 12 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్ , మ‌యాంక్ అగ‌ర్వాల్ హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. వీరిద్ద‌రు తొలి వికెట్‌కు ఏకంగా 97 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. మ‌ధ్య‌లో ముంబై బౌల‌ర్లు క‌ట్ట‌డి చేసినప్పటికీ చివ‌ర్లో జితేష్ శ‌ర్మ, షారూక్ ఖాన్ మెరుపులు మెరిపించ‌డంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. చివ‌రి 3 ఓవ‌ర్ల‌లోనే పంజాబ్ 47 ప‌రుగులు చేసింది. ముంబై బౌల‌ర్ల‌లో బ‌సిల్ థంపి 2, ఎం. అశ్విన్, బుమ్రా, ఉన‌ద్క‌త్ త‌లో వికెట్ తీశారు.

199 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్‌ను ర‌నౌట్లు కొంప‌ముంచాయి. దీంతో డెవాల్డ్ బ్రెవిస్, తిల‌క్ వ‌ర్మ, సూర్య‌కుమార్ యాద‌వ్ రాణించిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ శుభారంభాన్ని ఇవ్వలేక‌పోయారు. అయితే డెవాల్డ్ బ్రెవిస్, తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ చెల‌రేగి ఆడి ముంబై ఇండియ‌న్స్‌ను ఆదుకున్నారు. ఫోర్లు, సిక్సుల‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. బ్రెవిస్
25 బంతుల్లో 49 ర‌న్స్‌ చేయగా…తిల‌క్ వ‌ర్మ 20 బంతుల్లో 36 ర‌న్స్‌ చేశాడు. తర్వాత పోల్లార్డ్ రనౌట్ అవడం…సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్లు కొట్టే క్రమంలో వికెట్ చేజార్చుకోవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.చివ‌రి ఓవ‌ర్లో విజ‌యానికి 22 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో ఓడియ‌న్ స్మిత్ 9 ప‌రుగులే ఇచ్చి 3 వికెట్లు తీయడంతో పంజాబ్ కింగ్స్ 12 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.