Site icon HashtagU Telugu

Shigella: అమెరికాను గడగడ వణికిస్తున్న షిగెల్లా.. పౌరులకు సీడీసీ హెచ్చరిక?

Shigella Stool

Shigella Stool

Shigella: గత కొంత కాలం నుండి షిగెల్లా బాక్టీరియా అమెరికాను గడగడ వణికిస్తుంది. ఇప్పటికే అక్కడి కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు తెలిసింది. యాంటీబయోటిక్స్ ను తట్టుకునే షిగెల్లా స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్నాయని అమెరికా ప్రజారోగ్య విభాగం సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. చికిత్సలో యాంటీబయోటిక్స్ కు స్పందించని ఇన్ఫెక్షన్ ను ఎక్స్ డి ఆర్ గా వ్యవహరిస్తారని తాజా ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది.

ఈ తరహా స్ట్రెయిన్ కేసు 2015లో ఒకటి కూడా నమోదు కాలేదని.. 2019లో నమోదైన అన్ని ఆరోగ్య కేసుల్లో ఒక శాతం ఇవే ఉన్నాయని.. ఇక గత ఏడాది 2022లో ఐదు శాతానికి చేరాయని తెలిపింది. చికిత్సలు ఉపయోగించే ఐదు యాంటీబయాటిక్స్ ను ఇది నిరోధిస్తుందని.. ఇది చికిత్సకు ఇబ్బందిగా మారటంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని తెలిపింది.

ప్రతి ఏటా నాలుగున్నర లక్షల కేసులు అక్కడ నమోదవుతున్నాయని తెలిసింది. ఇక ఈ బ్యాక్టీరియా అనేది షిగెల్లోసిస్ ఇన్ఫెక్షన్కు కారణం అవుతుందని.. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుందని తెలిసింది. ఇక ఈ వైరస్ కు లక్షణాలు.. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, అలసట మొదలైనవి ఉంటాయని తెలిసింది.

ఇక ఈ వ్యాధి కలుషిత నీరు, పాడైన ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుందని తెలిసింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ వ్యాధి చాలా ప్రమాదం అని తెలుస్తుంది. ఇక ఈ వ్యాధికి దూరంగా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రతతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగటం ముఖ్యమని తెలుస్తుంది. అయితే ఈ వ్యాధి భారత్ లో కేరళలో ఇదివరకు ఒక బాలుడికి సోకగా ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి ప్రజలంతా ముందు జాగ్రత్తలో ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు.

Exit mobile version