Site icon HashtagU Telugu

Hyderabad: షీటీమ్స్ ఆపరేషన్.. మహిళలను వేధిస్తున్న 122 మంది పట్టివేత

She Team

She Team

Hyderabad: యువతులు, మహిళలను వేధిస్తున్న 79 మంది పెద్దలు, 43 మంది మైనర్లు సహా 122 మందిని రాచకొండ షీ టీమ్‌లు పట్టుకున్నాయి. రాచకొండ మహిళా సేఫ్టీ వింగ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా విశ్వనాథ్ మాట్లాడుతూ.. మార్చి 16 నుంచి మార్చి 31 వరకు 148 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందిన ఫిర్యాదుల్లో ఫోన్ ద్వారా వేధించిన కేసులు 14, సోషల్ మీడియా యాప్స్ ద్వారా 36, డైరెక్ట్ వేధింపులు 98 కేసులు ఉన్నాయి.వీటిలో 14 క్రిమినల్ కేసులు, 70 చిన్న చిన్న కేసులు ఉన్నాయి. 43 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

షీ టీమ్స్ రాచకొండలో మార్చి 16 నుంచి మార్చి 31 వరకు మహిళా చట్టాలు, హక్కులు, మహిళలపై నేరాల గురించి 37 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 5875 మందికి అవగాహన కల్పించారు. అలాగే మహిళా కంపార్ట్‌మెంట్లలో ప్రయాణిస్తున్న ఐదుగురు పురుషులను అదుపులోకి తీసుకుని మెట్రో రైల్‌లో జరిమానా విధించారు. మహిళల క్షేమం కోసం గత ప్రభుత్వం షీటీమ్స్ ప్రవేశపెట్టింది. మహిళల రక్షణ కోసం ఏర్పాటైన షీటీమ్స్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి.