She Teams: బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసుుల…రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను ఓ కంట కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులను చూస్తే వారు ఒక్కసారిగా పారిపోయే ప్రమాదముందని గ్రహించిన వారు..చాటుగా వారు చేసే అసభ్య ప్రవర్తనను రికార్డు చేయిస్తున్నారు.
ఆ తర్వాత వివరాలు కనుక్కుని అరెస్ట్ చేస్తున్నారు. తప్పు చేసిన వారు తప్పిచుకోకుండా వీడియో సాక్ష్యం ఉంటుందని హైదరాబాద్ మహిళా సేఫ్టీ డీసీపీ కవిత తెలిపారు. ఇప్పటికే ఇలాంటి వారిని 12 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించామన్నారు. కోర్టు ఆధారాలన్నీ పరిశీలించి వారికి జరిమానా విధించిందన్నారు. షీ టీమ్ నిరంతరం మహిళా రక్షణ కోసం పని చేస్తుందని, ఇబ్బందులుంటే వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని ఆమె సూచించారు. మహిళలను వేధిస్తున్న ఫిర్యాదులు ఇటీవల కాలంలో భాగా పెరిగిపోతున్నాయని డీసీపీ కవిత తెలిపారు. యువతులను కాదు మహిళలను సైతం పోకిరీలు వేధిస్తున్నారని ఆమె వివరించారు.