మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) పేరు మీద ఉన్న వైఎస్సార్ జిల్లా (YSR Dist) పేరును మార్చిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSR Sharmila)స్పందించారు. టీడీపీ నిర్వహించనున్న మహానాడులో వైఎస్సార్ (YSR) పేరు పలకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆ జిల్లా పేరు మార్చినట్లు ఆమె ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం ఆమె వ్యక్తం చేశారు. షర్మిల వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినా, కడప జిల్లా చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాల పేర్ల విషయంలో సమానత ఉండాలని పేర్కొంటూ, “వైఎస్సార్ కడప జిల్లా అంటే తప్పేంటి? అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాను ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మార్చితే తప్పేంటని” ప్రశ్నించారు. వ్యక్తి కంటే ప్రాంత ప్రాధాన్యత ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
Poonam Kaur : పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ ?
ఈ వివాదం రాష్ట్రంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ పేరు తొలగించడమేలేని పరిస్థితుల్లో ఉండగా, జిల్లాకు ఆయన పేరు కొనసాగుతూ, స్థానిక గుర్తింపు కలిగించేలా మార్పు చేయడాన్ని షర్మిల సమతుల్య దృష్టితో చూడడం గమనార్హం. పార్టీల మధ్య రాజకీయ భేదాలు ఉన్నా, గత ముఖ్యమంత్రుల సేవలపై గౌరవం ఉండాలని ఆమె సూచించారు. వైఎస్సార్‌ను ప్రస్తుత ప్రభుత్వం కించపరిచే ప్రయత్నం చేస్తోందా అనే విమర్శల మధ్య, షర్మిల వివరణ కీలకంగా మారింది.