YSRTP : షర్మిల మనసు మార్చుకుందా..? కాంగ్రెస్ లో YSRTP ని విలీనం చేయడం లేదా..?

అధిష్టానం సూచనలు షర్మిల కు నచ్చకపోవడం తో ..పార్టీ విలీనాన్ని ఆలా హోల్డ్ లో పెట్టినట్లు

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 06:39 PM IST

వైస్ షర్మిల (YS Sharmila) మనసు మారిందా..? కాంగ్రెస్ పార్టీ లో తన పార్టీ YSRTP ని విలీనం చేయడం లేదా..? ప్రస్తుతం తెలంగాణ లో ఇలాగే మాట్లాడుకుంటున్నారు. రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి కూతురిగా మార్క్ చూపించాలని షర్మిల ఎన్నో కలలు కన్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తా..రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తా..కేసీఆర్ ని గద్దె దించుతా..దొరల పాలనా అంతం చేస్తా అంటూ భారీ సవాళ్లు చేస్తూ తెలంగాణ లో YSRTP (YSR తెలంగాణ పార్టీ ) పార్టీ ని స్థాపించింది. పార్టీ స్థాపించి..స్థాపించగానే కేసీఆర్ ఫై పోరాటం మొదలుపెట్టింది..రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలంతా మాట్లాడుకునేలా చేసుకుంది. కానీ ఇవేమి కూడా పార్టీ కి బలం తీసుకరాలేకపోయాయి. అలాగే రాష్ట్రంలో బహు పార్టీల నేపథ్యంలో షర్మిళ పార్టీకి అనుకున్నంత స్థాయిలో హైప్ రాలేదు. ఇవన్నీ చూస్తూ వచ్చిన షర్మిల..ఇక పార్టీ ని నడపడం కంటే కాంగ్రెస్ పార్టీ లో కలపడమే బెటర్ అని చర్చలు మొదలుపెట్టింది.

కాంగ్రెస్ సైతం షర్మిల పార్టీని విలీనం చేసుకునేందుకు మొగ్గు చూపింది. అలాగే షర్మిల విలీననానికి ముందే పలు కండీషన్లు పెట్టినట్లు బయటకు వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ (Congress ) పార్టీలో సముచిత స్థానం, ఉపాధ్యక్షురాలు స్థాయి పదవి ఇవ్వడం. రెండోది తాను కోరుకున్న 10 చోట్ల ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలి. మూడోది.. లోక్ సభ లేదా రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆమె కాంగ్రెస్ ను డిమాండ్ చేసింది. ఈమె డిమాండ్స్ కు ఓకే చెప్పిన కాంగ్రెస్..ఇవన్నీ తెలంగాణ లో కాదు ఏపీలో ఇస్తామని పెద్ద బాంబు పేల్చారు. దీంతో షాక్ కు గురైందట షర్మిల.

తెలంగాణ వ్యతిరేకిగా పేరున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy ) బిడ్డ వైఎస్ షర్మిల అనే ప్రచారం ఇప్పటీకే బిఆర్ఎస్ చేస్తుంది.. మరికొందరిలో రాజన్న బిడ్డ అనే సానుభూతి ఉంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ లోకి షర్మిలను ఆహ్వానించి ఆంధ్రులను ఆదరించే పార్టీగా ముద్ర వేసుకోడం మంచిది కాదని పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి సూచించారట. దీనిపై ఆలోచన చేసిన అధిష్టానం..షర్మిల కు తెలంగాణ బాధ్యతల కంటే ఏపీకి సంబదించిన బాధ్యతలు ఇస్తేనే బెటర్ అని డిసైడ్ అయ్యి..ఆమెకు తెలియజేసిందట. అయితే అధిష్టానం సూచనలు షర్మిల కు నచ్చకపోవడం తో ..పార్టీ విలీనాన్ని ఆలా హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. అందుకే కేసీఆర్ సర్కార్ ఫై మళ్లీ వ్యతిరేక గళం మొదలుపెట్టి.. ధర్నా చేపట్టారని అంటున్నారు. తాను ఎక్కడికి వెళ్లేది లేదు తెలంగాణలోనే ఉంటానన్న సంకేతాలు ఇలా ప్రజలకు ఇచ్చినట్లు చెపుతున్నారు. మరి నిజంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ లో కలవడం లేదా..అనేది ఆమె నోటి వెంటనే సమాధానం చెపితే కానీ క్లారిటీ రాదు.

Read Also : World Cup 2023: టైటిల్ రేసులో భారత్ తో పాటు మరో నాలుగు జట్లు