Site icon HashtagU Telugu

YS Sharmila: కేటీఆర్ కు షర్మిల సపోర్ట్.. ఆ వ్యాఖ్యలపై ఖండన!

Sharmila

Sharmila

బీజేపీ నేత తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూన్యూస్‌ కేటీఆర్‌ కుమారుడుని ఉద్దేశిస్తూ ఓ పోల్‌ పోస్ట్‌ చేసింది. దీనిపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి తెలంగాణలో మీ బీజేపీ నేతలకు నేర్పిస్తున్నది ఇదేనా? నా కుమారుడి శరీరాకృతిపై బీజేపీ ప్రచారకర్తలు అసహ్యమైన రాజకీయవ్యాఖ్యలు చేయడం సంస్కారమేనా? అంటూ మండిపడ్డారు. అయితే ప్రస్తుతం తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై పోల్ పెట్టడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేటీఆర్ కు మద్దతు తెలిపారు. ఈ మేరకు షర్మిల ఓ పోస్ట్ పెట్టారు. ‘ఒక తల్లిగా, ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా.. పిల్లలను వేధించడం, కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. మహిళలను కించపరచడం, పిల్లలను బాడీ షేమ్ చేయడం వంటి ప్రకటనలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

Exit mobile version