Site icon HashtagU Telugu

Sharad Pawar Vs Ajit Pawar : ఎన్సీపీ ఎమ్మెల్యేల సపోర్టు ఎవరికి ? తేలేది నేడే !

Sharad Pawar Vs Ajit pawar

Sharad Pawar Vs Ajit Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నాదా ? నీదా ? అనేది తేల్చుకునేందుకు శరద్ పవార్, ఆయన మేనల్లుడు అజిత్ పవార్ తలపడుతున్నారు.. 

ఈక్రమంలో తమతో ఉన్న NCP ఎమ్మెల్యేలతో  శరద్ పవార్, అజిత్ పవార్ వేర్వేరుగా ఈరోజు (బుధవారం) ముంబైలో సమావేశం కానున్నారు.

ఈ మీటింగ్ కు తప్పకుండా హాజరు కావాలంటూ NCP ఎమ్మెల్యేలు అందరికీ ఇద్దరు నేతలు(Sharad Pawar Vs Ajit Pawar) కూడా విప్ జారీ చేశారు. దీంతో ఎవరి విప్ ను ఎంతమంది ఎమ్మెల్యేలు ఫాలో అవుతారు అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ అజిత్ పవార్ దగ్గర మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండి ఉంటే .. హాజరుకాని వారిపై ఆయన  స్పీకర్ ద్వారా  అనర్హత వేటు వేయించే అవకాశం ఉంటుంది.  అజిత్ పవార్ ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. తన వెంట వచ్చిన వారిలో 8 మందికి మంత్రి పదవులు లభించేలా చేశారు.  ఈనేపథ్యంలో ఎవరి వెంట వెళ్లాలనే దానిపై NCP ఎమ్మెల్యేలు కూడా అంతర్గత  చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ వర్గం దక్షిణ ముంబైలోని వైబీ  చవాన్ సెంటర్‌లో మధ్యాహ్నం 1 గంటలకు సమావేశానికి పిలుపునిచ్చింది.  అజిత్ పవార్ బృందం ఉదయం 11 గంటలకు సబర్బన్ బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్ (MET) ప్రాంగణంలో సమావేశమవుతోంది.

Also read : Peeing On Man : మనిషిపై మూత్రం చేస్తారా ? ఇది మనుషులు చేసే పనియేనా ?

శరద్ పవార్ వర్గం తరఫున మీటింగ్ ఏర్పాట్లను చీఫ్ విప్‌ జితేంద్ర అవద్ చూస్తుండగా… అజిత్ పవార్ వర్గం తరఫున మీటింగ్ ఏర్పాట్లను చీఫ్ విప్‌ అనిల్ పాటిల్‌ పర్యవేక్షిస్తున్నారు. అజిత్ పవార్ కు మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందో లేదో ఈ మీటింగ్ తో తేలిపోతుందని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ అజిత్ మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ పొందితే..  శివసేన తరహాలో NCP ముక్కలయ్యే ఛాన్స్ ఉంది. ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 36 మంది తన వెంటే ఉన్నారని అజిత్ పవార్ అంటున్నారు. అయితే 13 మందే అజిత్ వెంట ఉన్నారని శరద్ పవార్ వర్గం వాదిస్తోంది.