Site icon HashtagU Telugu

Shanmukh Jashwanth: దీప్తితో ష‌ణ్ముఖ్ బ్రేకప్.. అస‌లు రీజ‌న్ ఇదే..!

Shanmukh Deepthi

Shanmukh Deepthi

సాఫ్ట్‏వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‏లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న‌ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జ‌స్వంత్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్‌, వెబ్ సిరీస్‌, డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన షణ్ముఖ్, ఇటీవ‌ల‌ తెలుగు బిగ్‌బాస్ 5వ సీజ‌న్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. బిగ్‌బాస్ రియాలిటీ షో ఎవ‌రి లైఫ్‌ను ఎలా మారుస్తుందో చెప్ప‌లేం. ఈ రియాలిటీ షో ఎంతోమందికి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో షణ్ముఖ్ కూడా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వ‌డంతో అత‌ని రేంజ్ మారిపోతుంద‌ని, అత‌నే బిగ్‏బాస్ సీజన్ 5 విన్నర్ అవుతాడని ష‌న్నూ ఫ్యాన్స్ భావించారు.

అయితే షణ్ముఖ్ బిగ్‌బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ కాక‌పోవ‌డమే కాకుండా త‌న‌కు ఉన్న ఫేమ్‌ను పోగొట్టుకున్నాడు. దానికి కార‌ణం మ‌రో బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరీతో చేసిన రొమాన్సే కార‌ణమ‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో మొద‌ట టాప్‌లోనే ఉన్న‌ షణ్ముఖ్, ఆ త‌ర్వాత‌ సిరితో రిలేష‌న్ కొంప‌ముంచింది. సిరితో శ్రుతి మించిన హగ్గులు, ముద్దులు బిగ్‌బాస్ చూసే ప్రేక్ష‌కుల‌కు చిరాకు తెప్పించాయి. త‌న‌ ప్రవర్తన కార‌ణంగా అప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు ఉన్న ఇమేజ్‌ను పూర్తిగా డ్యామేజ్ చేసుకోవ‌డ‌మే కాకుండా, బిగ్‌బాస్ టైటిల్ రేసులో చ‌తికిల ప‌డ్డాడు ష‌ణ్ముఖ్.

ఇక త‌న‌కు ఎప్పటినుంచో అన్ని విషయాల్లో మద్దతుగా ఉన్న గ‌ర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయనతో కూడా ష‌ణ్ముఖ్ విడిపోవాల్సి వ‌చ్చింది. దీంత్ ష‌ణ్ముఖ్‌తో దీప్తీ బ్రేక్అప్ చెప్ప‌డానికి సిరినే కార‌ణ‌మ‌ని సోష‌ల్ మీడియ‌లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే దీప్తితో బ్రేకప్ పై తాజాగా ష‌ణ్ముఖ్ క్లారిటీ ఇచ్చాడు. దీప్తీతో తాను విడిపోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని, సిరి త‌మ బ్రేక‌ప్‌కు కార‌ణం కాద‌ని చెప్పాడు. త‌న‌వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంద‌ని, ఎంతోమంది నెటిజన్స్ నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు, దీప్తి త‌న‌కు సపోర్ట్ చేసిందని ష‌న్నూ అన్నాడు. ఇక సిరితో చనువుగా ఉండడం వల్ల‌, దీప్తి కుటుంబం నుంచి తనకు ఒత్తిడి పెరిగింద‌ని, దీంతో బ్రేక‌ప్ చెప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని ష‌ణ్ముఖ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక‌ముందు తామిద్ద‌రం క‌లుస్తామో లేదో అన్న‌ది దేవుడి చేతుల్లో ఉంద‌ని ష‌ణ్ముఖ్ అన్నాడు.