ఐపీఎల్ సందడి షురూ అయింది. నెలాఖరున ప్రారంభమయ్యే లీగ్ కోసం ఇప్పటికే ప్రాంఛైజీలు తమ ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నాయి. రెండు కొత్త ప్రాంఛైజీలు ఈ సారి మైదానంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ సీజన్ పై మరింత ఆసక్తి నెలకొంది. కాగా ఐపీఎల్ లో ఎప్పుడు ఫేవరేట్ జట్టుగా ఉండే దిల్లీ క్యాపిటల్స్ ఈ సారి మరింత పటిష్టంగా కనిపించబోతుంది. జట్టు ఆటగాళ్లతో బలంగా దిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు కోచ్ లతోనూ మరింత బలంగా తయారైంది. ఇప్పటికే రికీ పాంటింగ్ ఆ జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలందించనుండగా.. షేన్ వాట్సన్ కూడా ఈ జట్టులో భాగమయ్యాడు. వాట్సాన్ దిల్లీ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ తరఫున ఎన్నో మరపురాని ఇన్నింగ్స్ ఆడిన షేన్ వాట్సన్.. ఇప్పుడు కొచ్గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యం ప్రకటన చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. తన దేశానికే చెందిన షేన్ వాట్సన్‌ను జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌కు సిఫార్సు చేశాడట. దీంతో పాంటింగ్ సిఫార్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ అంగీకరించిందని సమాచారం. అయితే అసిస్టెంట్ కోచ్గా ఎన్నికైన షేన్ వాట్సన్ స్పందిస్తూ.. దిగ్గజ ఆటగాడు రిక్కీ పాంటింగ్ ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం వచ్చింది. అతడు అద్భుతమైన నాయకుడు. ప్రపంచంలోనే అత్యుత్తమ కోచ్లలో ఒకడు. అతడి సారథ్యంలో పనిచేసేందుకు సంతోషిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
వాట్సాన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 145 మ్యాచ్‌లు ఆడాడు.3874 పరుగులు చేసి 13 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో 92 వికెట్లు నేలరాల్చాడు. ఈ లీగ్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకపోతే వాట్సాన్ రాకతో ఢిల్లీ మరింత బలంగా కనిపిస్తుంది. చూడాలి మరి దిగ్గజాలతో కూడిన ఈ జట్టు ఈ మేర రాణిస్తుందో చూడాలి.