Site icon HashtagU Telugu

Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. బౌలింగ్ కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న షేన్ బాండ్..!

Mumbai Indians

Compressjpeg.online 1280x720 Image (3) 11zon

Mumbai Indians: న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ (Shane Bond) ఇకపై ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బౌలింగ్ కోచ్‌గా ఉండడని ముంబై ఇండియన్స్ బుధవారం ప్రకటించింది. బాండ్ 2015లో ముంబై ఇండియన్స్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు IPL 2015, 2017, 2019, 2020లో విజేతగా నిలిచింది. ముంబై ఇండియన్స్ జట్టులో బౌలింగ్ ఎటాక్‌ను అభివృద్ధి చేయడంలో షేన్ బాండ్ కీలక పాత్ర పోషించాడు. బాండ్ ఇంటర్నేషనల్ లీగ్ T20 ప్రారంభ ఎడిషన్‌లో MI ఎమిరేట్స్‌కు ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు. 9 సంవత్సరాలలో జట్టును 4 సార్లు ఛాంపియన్‌గా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు బాండ్.

ఇప్పటికే ముంబై ఇండియన్స్ IPL 2024కి బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగను నియమించిన విషయం తెలిసిందే. మలింగ IPL 2021 వరకు ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడాడు. ఆ తర్వాత దిగ్గజ శ్రీలంక బౌలర్ IPL 2023 వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పనిచేశాడు. మలింగ IPL తదుపరి సీజన్ అంటే IPL 2024 కోసం మరోసారి ముంబై ఇండియన్స్ జట్టుతో జత కట్టనున్నాడు.

Also Read: IND Vs AUS: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, విశాఖలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్

We’re now on WhatsApp. Click to Join.

ముంబై ఇండియన్స్‌కు షేన్ బాండ్ గుడ్ బై

బాండ్ తన వీడ్కోలు నోట్‌లో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. “గత తొమ్మిది సీజన్‌లుగా MI కుటుంబంలో భాగమయ్యే అవకాశం నాకు కల్పించిన అంబానీ కుటుంబానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ముంబై జట్టుతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంది గొప్ప వ్యక్తులు, ఆటగాళ్లు, సిబ్బందితో మంచి సంబంధాలను పెంచుకున్నాను. వారి భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చివరగా MI పల్టాన్‌కి కూడా ధన్యవాదాలు.” అని రాసుకొచ్చాడు.

ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2020లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్‌లకు కూడా చేరలేకపోయింది. అయితే IPL 2023లో పేలవమైన ప్రారంభం ఉన్నప్పటికీ రోహిత్ శర్మ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కానీ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది.