Site icon HashtagU Telugu

Shahrukh: రస్సెల్ ఆటపై షారూక్ సూపర్ ట్వీట్

ఆండ్రూ రస్సెల్ బ్యాటింగ్…కేకేఆర్ జట్టు విజయంపై ఫ్రాంచైజీ ఓనర్…బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ భిన్నమైన కామెంట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై శుక్రవారం కేకేఆర్ మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా కూడా రస్సెల్ బ్యాటింగ్ వల్లే సాధ్యమైంది. కేవలం 31 బంతుల్లో 70 పరుగులు సాధించాడు రస్సెల్. దీంతో 138 పరుగుల లక్ష్యాన్ని మరో 5.3ఓవర్లు ఉండగానే..కేకేఆర్ పూర్తి చేసింది.
దీనిపై కోల్ కత్త నైట్ రైడర్స్ యజమాని షారూక్ ఖాన్ ట్వీటర్ చేశాడు. నా స్నేహితుడు రస్సెల్ కు తిరిగి స్వాగతం. బంతి ఎత్తుకు ఎగరడం చాలా సమయం చూశాను..నీవు ఆ బంతిని కొట్టినప్పుడు దానంతట అదే ఊపిరి తీసుకుని పయనించింది…అంటూ షారూక్ ఖాన్ ట్వీట్ చేశాడు. ఉమేశ్ తోపాటు, శ్రేయాస్ అయ్యార్…జట్టు మొత్తం కూడా చక్కగా ఆడి మంచి విజయాన్ని అందించారని ప్రశంసించాడు.