Site icon HashtagU Telugu

Shahdol Rail Accident: మధ్యప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం

Shahdol Rail Accident

New Web Story Copy (8)

Shahdol Rail Accident: మధ్యప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆగ్నేయ మధ్య రైల్వే బిలాస్‌పూర్ జోన్‌లోని షాడోల్ సబ్ డివిజన్‌లోని సింగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 కోచ్ లు బోల్తా పడటంతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా.. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఒక లోకో పైలట్ మరణించగా… మరొకరికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే లోకో షెడ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఉదయం 7.15 గంటల ప్రాంతంలో జరిగింది. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, ఉద్యోగులు సహాయక చర్యలు చేపట్టారు.
అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో విచారణ తర్వాతే చెప్పగలమని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతామన్నారు. ప్రస్తుతం ఇతర రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కట్నీ, బిలాస్‌పూర్‌ నుంచి వచ్చే రైళ్లు, గూడ్స్‌ రైళ్లు నిలిచిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.