KA Paul: కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు

షీ టీమ్స్‌ను ఆశ్రయించిన ఆమె, ఘటనకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌లు సహా కొన్ని ఆధారాలను అధికారులకు సమర్పించింది.

Published By: HashtagU Telugu Desk
KA Paul

KA Paul

హైదరాబాద్ : (KA Paul Case) ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆయనపై తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు కేఏ పాల్‌ కంపెనీలో నైట్‌ షిఫ్ట్‌లో పని చేస్తూ ఈ వేధింపులకు గురయ్యానని తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షీ టీమ్స్‌ను ఆశ్రయించిన ఆమె, ఘటనకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌లు సహా కొన్ని ఆధారాలను అధికారులకు సమర్పించింది. వాటిని పరిశీలించిన పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

పంజాగుట్ట పోలీసులు ఈ కేసును గంభీరంగా తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆధారాల సేకరణ, బాధితురాలి స్టేట్‌మెంట్ తదితర ప్రక్రియలు కొనసాగుతున్నాయి.

  Last Updated: 21 Sep 2025, 02:57 PM IST