Site icon HashtagU Telugu

AP News: రేపు ఏపీలో తీవ్ర వడగాల్పులు.. ఆ మండలాలకు హెచ్చరిక

Heat Stroke Remedies

Avoid These Spicy Items in Summer

AP News: బుధవారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 16 మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలను అధికారులు గుర్తించారు. మన్యం2, శ్రీకాకుళం8, విజయనగరం వేపాడ మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.

శ్రీకాకుళం 17, విజయనగరం25, పార్వతీపురంమన్యం11, అల్లూరిసీతారామరాజు10, విశాఖపట్నం3,
అనకాపల్లి16, కాకినాడ10, కోనసీమ9, తూర్పుగోదావరి19, పశ్చిమగోదావరి4, ఏలూరు7, కృష్ణా, ఎన్టీఆర్2, పల్నాడు అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

కాగా ఏపీలో నీటి కొరత ఏర్పడుతుంది. సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ పట్టణాల ప్రజలకు త్రాగునీటికి సరఫరా చేసే సామర్లకోట లోని రెండు జలాశయాలలలో నీటి నిల్వలు అడుగంటాయి. ఎండలు అధిక. కావడం, త్రాగునీటి వినియోగం పెరగడం, గోదావరి కాలువలో నీటి విడుదలలు తగ్గిపోవడంతో సహజంగానే నీటి నిల్వలు తగ్గాయి. కాలువలో నీటివిడుదలసమయంలో మునిసిపల్ అధికారులకు ముందుచూపు కొరవడడంతోనే వేసవిలోత్రాగునీటిఇబ్బందులు తప్పడం లేదని మూడు పట్టణాల ప్రజలు వాపోయారు.