Temperature : ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తన పంజాను విసురుతోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు చేసి రాష్ట్రంలోనే చలి తీవ్రతకు గరిష్ట స్థాయిని చేరింది. న్యాల్కల్ 8.2 డిగ్రీలు, అల్గోల్ 8.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మెదక్ జిల్లా టేక్మాల్ 9.3, నర్సాపూర్ 9.5 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ 9.7, బేగంపేట 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో చలి ప్రభావం కొనసాగుతోంది.
ఉదయం మంచు దుప్పటి: రాత్రి చలి తీవ్రత
సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రభావం ప్రారంభమై, రాత్రి 7 గంటలకు మరింత తీవ్రతకు చేరుకుంటుంది. ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రంగా ఉంటోంది. ఉదయం పొగమంచు కమ్మేయడంతో రహదారులపై తీవ్ర అసౌకర్యం తలెత్తుతోంది. జాతీయ రహదారులు పొగమంచుతో కప్పేయబడటం వల్ల వాహనాల రాకపోకలు ఆలస్యం అవుతుండగా, కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
Vastu Tips : ఆర్థిక ఇబ్బందులా? ఈ మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటండి..
జాగ్రత్తలు పాటించాలని సూచనలు
వాతావరణ నిపుణుల ప్రకారం, రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు అవసరం లేకుండా రాత్రి ప్రయాణాలు చేయవద్దని, తెల్లవారుజామున సురక్షితమైన వేళల్లోనే బయటకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు చలికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రజల ఇబ్బందులు
ఉదయం పొగమంచు వీడకపోవడంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, పాలు, కూరగాయలు అమ్మే వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి ప్రభావంతో ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ముఖ్యంగా పొగమంచు కారణంగా రహదారులపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చలి పరిస్థితి మరింత రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని సూచనలు అందించారు.
Pawan Kalyan : నాకు పుస్తకాలు ప్రాణం… జీవితంలో ఎంతో ధైర్యాన్నిచ్చాయి