West Bengal: ప‌శ్చిమ బెంగాల్‌లో రాజకీయ హత్యాకాండ..!

ప‌శ్చిమ బంగాల్‌లో మళ్లీ మొద‌లైన‌ రాజకీయ హత్యాకాండ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. రాజ‌కీయ హత్య‌లతో ప‌శ్చిమ‌ బెంగాల్ మ‌ళ్ళీ అట్టుడికింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే గ్రామంలో టీఎంసీ నేత బహ‌దుర్ షేక్ బాంబు దాడిలో మరణించారు. దీంతో అక్క‌డి టీఎంసీ కార్యకర్తలు ఆగ్రహంతో ఆ గ్రామంలోని ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇంట్లోని వారు బయటికి రాకుండా తాళాలు వేసి ఈ పని చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. […]

Published By: HashtagU Telugu Desk
West Bengal

West Bengal

ప‌శ్చిమ బంగాల్‌లో మళ్లీ మొద‌లైన‌ రాజకీయ హత్యాకాండ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. రాజ‌కీయ హత్య‌లతో ప‌శ్చిమ‌ బెంగాల్ మ‌ళ్ళీ అట్టుడికింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే గ్రామంలో టీఎంసీ నేత బహ‌దుర్ షేక్ బాంబు దాడిలో మరణించారు. దీంతో అక్క‌డి టీఎంసీ కార్యకర్తలు ఆగ్రహంతో ఆ గ్రామంలోని ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇంట్లోని వారు బయటికి రాకుండా తాళాలు వేసి ఈ పని చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం తెలుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతదేహాల సంఖ్య మరింత పెరిగేందుకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తతలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.. అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశార‌ని స‌మాచారం.

  Last Updated: 22 Mar 2022, 04:09 PM IST