Rajasthan: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో నీటిలో మునిగి 7 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన ఫర్సన్ గ్రామంలో జరిగినట్లు చెబుతున్నారు. సమాచారం ప్రకారం చెరువు గట్టు తెగిపోవడంతో ఈ హృదయ విదారక సంఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటనలో 8 మంది చిన్నారులు నదిలో గల్లంతయ్యారని, అందులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు.
గత కొద్దీ రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ పరిస్థితిలో ప్రవహించే నది నీటిని చూసేందుకు పిల్లలు వచ్చారు, అయితే కొందరు పిల్లలు రీల్స్ పిచ్చితో ప్రమాద అంచున వీడియోలు తీయడం ప్రారంభించారు. అయితే నదికి ఆనుకుని ఉన్న చెరువు గట్టుపై పై నిలబడి వీడియోలు చేస్తున్న సమయంలో నీటి ప్రవాహం పెరిగి ఒక్కసారిగా గట్టు తెగింది. ఈ ప్రమాదంలో 7 మంది చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు. అయితే ఒకరు పొదలు సహాయంతో తనను తాను రక్షించుకున్నాడు.
సమాచారం అందుకున్న తల్లిదండ్రులకు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే ఆలస్యం అయింది. ఈ ప్రమాదం తరువాత గ్రామం మొత్తం శోక సంద్రంలో మునిగింది. చిన్నారులు కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటన జరిగిన 1 గంట తర్వాత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారుల సమక్షంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారులందరి మృతదేహాలను బయటకు తీశారు. అందరి వయస్సు 17 నుంచి 23 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం, ప్రజలను నది ఒడ్డుకు వెళ్లకుండా నిషేధించారు.
Also Read: MP Plane Crash: మధ్యప్రదేశ్‌లో విమాన ప్రమాదంలో గాయపడిన ఇద్దరు పైలట్లు